పుష్ప 2 చూసి షాక్ తిన్నాను.. 20 రోజులు షూటింగ్ చేశాను.. చివరికి ఇలా చేస్తారా అనిపించింది: దివి వాద్యా షాకింగ్ కామెంట్స్

పుష్ప 2 మూవీపై బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఈ సినిమా కోసం 20 రోజుల షూటింగ్ చేసినా కూడా.. చివరికి మూవీలో తన పార్ట్ సరిగా కనిపించకపోవడంతో నిరాశ చెందినట్లు చెప్పింది.

Published on: Mar 20, 2026, 22:04:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించిన ఒక నటి మాత్రం తన పాత్ర విషయంలో చాలా నిరాశకు గురైంది. బిగ్‌బాస్ ఫేమ్, యంగ్ బ్యూటీ దివి వాద్యా ఈ సినిమాలో ఒక రిపోర్టర్ తరహా పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ కట్‌లో తన పాత్రను బాగా తగ్గించేయడం పట్ల ఆమె ఓపెన్‌గా తన ఆవేదనను బయటపెట్టింది. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో దివి తాజాగా దీనిపై స్పందించింది.

పుష్ప 2 చూసి షాక్ తిన్నాను.. 20 రోజులు షూటింగ్ చేశాను.. చివరికి ఇలా చేస్తారా అనిపించింది: దివి వాద్యా షాకింగ్ కామెంట్స్
పుష్ప 2 చూసి షాక్ తిన్నాను.. 20 రోజులు షూటింగ్ చేశాను.. చివరికి ఇలా చేస్తారా అనిపించింది: దివి వాద్యా షాకింగ్ కామెంట్స్

దివి అసలు ఏమన్నదంటే?

పుష్ప 2 సినిమాలో తన క్యారెక్టర్ గురించి దివి మాట్లాడుతూ.. "మొదట నాకు కథ చెప్పినప్పుడు నా పాత్ర చాలా పెద్దది అని చెప్పారు. నా క్యారెక్టర్‌కు సంబంధించి ఒక స్పెషల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అది చూసి నేను కూడా నాది నిజంగానే సినిమాలో చాలా పెద్ద రోల్ అని ఎంతో ఆశపడ్డాను. నాతోపాటు పది మంది ఫ్రెండ్స్ ను తీసుకెళ్లాను. కానీ తీరా థియేటర్‌లో సినిమా చూశాక నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. నా పాత్ర నిడివి అంత తక్కువగా ఉండటం చూసి చాలా బాధపడ్డాను. విపరీతమైన నిరాశకు గురయ్యాను" అంటూ తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టింది.

20 రోజుల షూటింగ్.. 10 రోజుల డబ్బింగ్

పుష్ప 2 మూవీలో దివి తన పాత్ర కోసం ఏకంగా 20 రోజుల పాటు షూటింగ్ చేసిందట. అంతేకాదు అదనంగా మరో 10 రోజుల పాటు డబ్బింగ్ చెప్పిందట. ఈ స్థాయిలో షూటింగ్ జరిగిన తర్వాత మూవీలో చాలా ఎక్కువ నిడివి ఉన్న పాత్రే అని అనుకోవడం సహజం. కానీ దివి మాత్రం తన విషయంలో అలా జరిగేసరికి తీవ్రంగా నిరాశ చెందింది.

అందులోనూ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ చూసిన తర్వాత అలాంటి సినిమాలో అవకాశం రావడమే గొప్ప అని భావించడం సహజం. ఆ ఛాన్స్ కొట్టేసినా దివికి మాత్రం చివరికి ఇలా జరగడం నిజంగా బాధాకరమే.

బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో 49 రోజుల పాటు హౌజ్ లో ఉండి ఫేమస్ అయింది దివి. ఆమె ఈ మధ్యే తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ హనీలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More