Bigg Boss Telugu 10: ఓరి నాయనో.. స్క్రిప్ట్ మొత్తం మార్చేశారుగా.. బిగ్ బాస్ 10లోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్.. కెప్టెన్సీ!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ గా మామూలుగా సాగడం లేదు. ట్విస్ట్ ల మీద ట్విస్టులు, షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. రెండో వీక్ ‘పవర్ ఆఫ్ పీపుల్’ అన్నారు కానీ మరీ ఇంతలా స్క్రిప్ట్ మారుస్తారనుకోలేదనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏమైందో ఇక్కడ చూసేయండి. 

Published on: Sep 16, 2026, 12:31:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ సారి పదో సీజన్ కాబట్టి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న మేకర్స్ వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్ లోకి తీసుకురాబోతున్నారు.

ఓరి నాయనో.. స్క్రిప్ట్ మొత్తం మార్చేశారుగా.. బిగ్ బాస్ 10లోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్.. కెప్టెన్సీ! (instagram)
ఓరి నాయనో.. స్క్రిప్ట్ మొత్తం మార్చేశారుగా.. బిగ్ బాస్ 10లోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్.. కెప్టెన్సీ! (instagram)

బిగ్ బాస్ ట్విస్ట్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సెకండ్ వీక్ ను ‘పవర్ ఆఫ్ పీపుల్’ గా బిగ్ బాస్ మేకర్స్ నిర్ణయించారు. అంటే షో చూసే ఆడియన్స్ చేతుల్లోనే పవర్ పెట్టారు. ఏదో పేరుకే పవర్ ఆఫ్ పీపుల్ అన్నారనుకున్నారు కానీ నిజంగానే రెండో వారంలో ఓటింగ్ తో అంతా తారుమారు చేస్తున్నారు.

ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లు

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఫస్ట్ వీక్ లోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మిడ్ వీక్ లోనే ఫస్ట్ చరణ్ ను, ఆ తర్వాత చైత్ర రాయ్ ను ఇంటి నుంచి పంపించేశారు. ఇప్పుడు వీళ్లలో ఒకరిని తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చే పవర్ ను ఆడియన్స్ కు ఇచ్చాడు బిగ్ బాస్.

ఓటింగ్ తో

పవర్ ఆఫ్ పీపుల్ లో ఆడియన్స్ కు ఫైనల్ పవర్ ఇచ్చారు. అదే ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రకు ఓటు వేయడం. ఇద్దరిలో తమకు నచ్చిన కంటెస్టెంట్ ను తిరిగి హౌస్ లో చూడాలనుకుంటే ఆడియన్స్ వాళ్లకు ఓట్లు వేయాలి. ఇలా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లను హౌస్ లోకి తిరిగి తీసుకురాబోతున్నారు.

కెప్టెన్సీ రేసు

బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారంలో జనాలు ఓటింగ్ తో ఎంచుకున్న కంటెస్టెంట్లకే కెప్టెన్సీ రేసులో పోటీ పెట్టారు. చివరకు ఝాన్సీ, ముఖేష్ నిలిచారు. ఈ నేపథ్యంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల నుంచి హౌస్ లోకి అడుగుపెట్టే చరణ్ లేదా చైత్ర డైరెక్ట్ గా కెప్టెన్సీ రేసులో పోటీపడే అవకాశముందని టాక్. అంటే ఝాన్సీ, ముఖేష్ తో పాటు చరణ్ లేదా చైత్రలో ఒకరు కెప్టెన్సీ కోసం తలపడనున్నారు.

ఎవరో మరి?

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రలో ఎవరు తిరిగి హౌస్ లోకి వస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే ఓట్లు వేయాలని సోషల్ మీడియాలో చరణ్, చైత్ర రిక్వెస్ట్ లు పెడుతూనే ఉన్నారు. ఈ ఓటింగ్ లైన్స్ ఇవాళ (సెప్టెంబర్ 16) మధ్యాహ్నం 12 గంటలకు ముగిశాయి. మరి వీళ్లలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More