Bigg Boss 10 Contestants: ఆ స్టార్ సీరియల్ హీరో నుంచి ప్రముఖ యాంకర్ వరకు.. బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ లిస్ట్ ఇదేనా?
Bigg Boss 10 Contestants: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆదివారమే (సెప్టెంబర్ 6) ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త సీజన్ లో హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల లిస్ట్ పై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది.
Bigg Boss 10 Contestants: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' (Bigg Boss Telugu 10) గ్రాండ్ లాంచ్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కొత్త సీజన్ సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లో ప్రారంభం కాబోతోంది. ఈ సారి 'దశావతారం' థీమ్‌తో రాబోతున్న ఈ షోలోకి అడుగుపెట్టే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రిషి సార్ ఎంట్రీతో షో రేటింగ్స్ నెక్స్ట్ లెవెల్
ప్రతి బిగ్ బాస్ సీజన్ ప్రారంభానికి ముందు కంటెస్టెంట్లు ఎవరన్న చర్చ సహజంగానే జరుగుతుంది. తెరపైకి రకరకాల పేర్లు వస్తూనే ఉంటాయి. షో ఆర్గనైజర్లు మాత్రం చివరి నిమిషం వరకు పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడినా.. ఏదో ఒకరకంగా లీకులు అవుతూనే ఉంటాయి. అలా ఈసారి కూడా కొందరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చాయి.
ఈ సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ. బుల్లితెరపై రిషి సార్‌గా విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ముఖేష్ హౌస్‌లోకి అడుగుపెడితే బిగ్ బాస్ 10 టీఆర్‌పీ రేటింగ్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనతో పాటు సీరియల్ నటి దేబ్జానీ మోదక్, చైత్రా రాయ్ కూడా కంటెస్టెంట్స్‌గా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
గ్లామర్, కామెడీ డోస్ పెంచేందుకు క్రేజీ సెలబ్రిటీలు
ఈ సారి హౌస్‌లో గ్లామర్ విందు అందించడానికి ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరరాజన్, యాంకర్ సుధీర్ రెడ్డి సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. అలాగే జబర్దస్త్ కామెడీ విభాగానికి సంబంధించి ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ నరేష్, టెంపర్ వంశీ లాంటి కమెడియన్లు హౌస్‌లో అడుగుపెట్టి ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెంచబోతున్నారు.
సినిమా రంగం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కృష్ణుడు, టాలీవుడ్ యంగ్ హీరో అదిత్ ఈశ్వరన్ (అదిత్ అరుణ్) కూడా ఈ సీజన్‌లో సందడి చేయనున్నారు. వేర్వేరు రంగాల నుంచి వస్తున్న ఈ స్టార్స్ మధ్య హౌస్‌లో ఎలాంటి మైండ్ గేమ్‌లు నడుస్తాయో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కామనర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. 'అగ్నిపరీక్ష' నుంచి కాంటెస్ట్
ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే.. కేవలం సెలబ్రిటీలే కాకుండా 'అగ్నిపరీక్ష' టాలెంట్ హంట్ ద్వారా సెలెక్ట్ అయిన కామనర్స్‌కు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ దక్కింది. దాదాపు 70 మంది నుంచి ఫైనల్ అయిన 15 మంది కామనర్స్‌లో నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ప్రధాన హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.
గత సీజన్ 9లో కామనర్ కేటగిరీ నుంచి వచ్చిన కల్యాణ్ పడాల టైటిల్ విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. దాంతో ఈ సారి సెలబ్రిటీలకు కామనర్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాగార్జున తన మార్క్ హోస్టింగ్‌తో సెప్టెంబర్ 6న ఈ గ్రాండ్ ఈవెంట్‌ను ఎలా నడిపిస్తారో వేచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


