...
...
Next Story

Bigg Boss 10: మరో 5 రోజుల్లోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛ్-ఈ సారి కంటెస్టెంట్లు మామూలుగా లేరు-ఫుల్ లిస్ట్ ఇదే-గ్లామర్ షో!

Bigg Boss 10: బిగ్ బాస్ లవర్స్ గెట్ రెడీ. మీకు అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు, బిగ్ బాస్ కిక్ ను మరింత పెంచేందుకు కొత్త సీజన్ వచ్చేస్తోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు మరో5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ సారి హౌస్ లో అడుగుపెడతారనే అంచనాలున్న 10 మంది సెలబ్రిటీల లిస్ట్ ఇక్కడుంది. ఓ లుక్కేయండి.

Published on: Sep 1, 2026, 11:26:41 IST
Advertisement

Bigg Boss 10: సక్సెస్ ఫుల్ రియాలిటీ షో ‘బిగ్‌ బాస్’ తన మైల్ స్టోన్ 10వ సీజన్‌కు సిద్ధమైంది. తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు బిగ్‌ బాస్ తెలుగు 10 (Bigg Boss Telugu 10) రూపంలో సరికొత్త 'దశావతారం' కాన్సెప్ట్‌తో అలరించేందుకు వస్తోంది. ఈ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ మరో 5 రోజుల్లోనే స్టార్ట్ కానుంది.

బిగ్ బాస్ 10 లాంఛ్

మరో 5 రోజుల్లోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛ్-ఈ సారి కంటెస్టెంట్లు మామూలుగా లేరు-ఫుల్ లిస్ట్ ఇదే-గ్లామర్ షో! (instagram)
మరో 5 రోజుల్లోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛ్-ఈ సారి కంటెస్టెంట్లు మామూలుగా లేరు-ఫుల్ లిస్ట్ ఇదే-గ్లామర్ షో! (instagram)

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈసారి హౌస్‌లోకి ప్రారంభంలో కేవలం 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే అడుగుపెట్టనుండగా, మిగతా వారిని వైల్డ్ కార్డ్, మిడ్-వీక్ ఎంట్రీల ద్వారా పంపేలా మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది.

‘దశావతారం’ థీమ్‌తో

మైలురాయిగా నిలిచే 10వ సీజన్ కావడంతో నిర్వాహకులు ఈసారి బిగ్ బాస్ షో ఫార్మాట్‌లో విప్లవాత్మక మార్పులు చేశారని టాక్. సాధారణంగా తొలిరోజే 15, 16 మంది వరకూ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేవాళ్లు. కానీ ఈ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో 'దశావతారం' థీమ్‌కు తగ్గట్టుగా ప్రారంభంలో కేవలం 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు మాత్రమే హౌస్‌లోకి వెళ్తారని సమాచారం.

వైల్డ్ కార్డు ట్విస్ట్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ప్రారంభంలో తక్కువ మంది ఉండటంతో ఆట వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత వారాల్లో మిడ్-వీక్ ఎంట్రీలు, వైల్డ్ కార్డ్‌ల రూపంలో మైండ్ గేమ్‌ను నడిపించనున్నారు. మరోవైపు అగ్నిపరీక్ష ద్వారా కామనర్లు కూడా హౌస్ లో అడుగుపెట్టనున్నారు.

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్

ఇక హాట్ యాంకర్, నటి వర్షిణి సౌందరరాజన్ తో పాటు కృష్ణుడు, టెంపర్ వంశీ, అదిత్ అరుణ్ ('చెన్నై లవ్ స్టోరీ' ఫేమ్), పాపులర్ యూట్యూబర్ సుధీర్ రెడ్డి హౌస్ లోిక వెళ్తున్నారని టాక్.

గ్లామర్ షో

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో గ్లామర్ షో ఏ మాత్రం తగ్గకుండా మేకర్స్ ప్లాన్ వేసినట్లు తెలిసింది. అందుకే వర్షిణి సౌందరరాజన్, చైత్ర రాయ్, దేబ్జానీ మోదక్ ను రంగంలోకి దించుతున్నారని అంటున్నారు. దీంతో నాగార్జున మార్క్ హోస్టింగ్, జబర్దస్త్ టీమ్ కామెడీ, యూట్యూబ్ స్టార్ల హంగామా, గ్లామర్ షో కలిస్తే ఈ సీజన్ బుల్లితెరపై కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe