Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ ఎలిమినేషన్లో షాకింగ్ ట్విస్ట్.. టాప్ కంటెస్టెంట్, రైతు బిడ్డ అవుట్.. అదే కారణం!
Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన సింగర్ ఝాన్సీ ఎనిమిదో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అంచనాలు పెంచేసిన ఝాన్సీ ఎలిమినేషన్ ఊహించనిదే అనే టాక్ వినిపిస్తోంది.
Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss Telugu 10) రసవత్తరంగా సాగుతోంది. రోజుకో మలుపు, వారం వారం సరికొత్త ట్విస్ట్‌లతో కింగ్ నాగార్జున ఈ షోను మరింత రక్తికట్టిస్తున్నారు. ఎప్పుడెవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో, ఎవరు కెప్టెన్ అవుతారో ఊహించడం కష్టంగా మారింది. అయితే, తాజాగా జరిగిన ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేసేలా ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఝాన్సీ ఎలిమినేట్?
వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న సింగర్ ఝాన్సీ ఈ వారం బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సీజన్ 10లో సింగర్‌గా, రైతు బిడ్డగా హౌస్‌లోకి అడుగుపెట్టింది ఝాన్సీ. మొదటి వారం నుంచే తనదైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఫిజికల్ టాస్క్‌ల పరంగా ఏమాత్రం తగ్గకుండా ఆడుతూ, ఎవరికీ భయపడకుండా తన గళం వినిపిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అంచనాలు పెంచేసింది.
హౌస్‌లో ముఖేష్, సుధీర్, వర్షిణిలతో ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకుని, గ్రూప్ గేమ్ కాకుండా ఇండివిడ్యువల్‌గా ఆడుతూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అలాంటి ఝాన్సీ అకస్మాత్తుగా హౌస్ నుంచి బయటకు రావడం ఆమె ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు.
రెడ్ జోన్ టెన్షన్..
ఈ ఎనిమిదో వారం బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లను రెడ్, గ్రీన్, ఎల్లో జోన్ల వారీగా విభజించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఆట ఆడని వారిని రెడ్ జోన్లో ఉంచి, వారికి ఎలిమినేషన్ ముప్పు పొంచి ఉందని బిగ్ బాస్ ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. దీనికి తోడు గోట్ (GOAT) ఆఫ్ ది వీక్‌గా నిలిచిన త్రిగుణ్, సంచాలక్‌గా వ్యవహరిస్తూ ఫౌల్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ పీకాడు. ఈ క్రమంలోనే ఝాన్సీ, రోహిత్, సుధీర్ లాంటి వారు డేంజర్ జోన్లో పడ్డారు.
ఆ మ్యాజిక్ పవర్ ట్విస్ట్ వర్కౌట్ కాలేదా?
సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ ఓ ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఓటింగ్ లెక్కల ప్రకారం ముందుగా తక్కువ ఓట్లు వచ్చిన సుధీర్ ఎలిమినేట్ అవుతాడని అంతా భావించారు. అయితే, మ్యాజిక్ పవర్స్ వాడి కంటెస్టెంట్లు ఒకరినొకరు సేవ్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు.
ముఖేష్ తన పవర్‌తో ఝాన్సీని సేవ్ చేస్తే.. ఆమె తన ఫ్రీ పవర్‌తో సుధీర్‌ను సేవ్ చేసి మానవత్వం చాటుకున్నట్లు లీక్స్ వచ్చాయి. కానీ, చిట్టచివరికి ఓటింగ్ శాతంలో వెనుకబడిపోవడం, గ్రీన్ జోన్ సభ్యుల డెసిషన్ ట్విస్ట్‌ల కారణంగా ఝాన్సీకే ఎలిమినేషన్ వేటు పడినట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.
హౌస్‌లో మారనున్న ఈక్వేషన్స్..
స్ట్రాంగ్ ప్లేయర్‌గా ఉన్న ఝాన్సీ ఎలిమినేషన్ వార్తతో సుధీర్, ముఖేష్, వర్షిణి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఆడియెన్స్ ఓటింగ్ కలగలిపి ఈ అనూహ్య ఫలితం వచ్చినట్లు సమాచారం. ఈ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో ఈక్వేషన్స్ పూర్తిగా మారనున్నాయి. టైటిల్ విన్నర్ రేసులో ఉంటుందని భావించిన ఝాన్సీ ఇలా మధ్యలోనే వెళ్లిపోవడం నిజంగా ఊహించనిదే. మరి ఈ లీక్స్‌లో ఎంతవరకు నిజం ఉందో, ఇంకేమైనా సీక్రెట్ రూమ్ ట్విస్ట్ ఉందా అనేది వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


