Bigg Boss Telugu 10: ఇప్పటికైనా నవ్వించండి బాబూ.. బిగ్ బాస్ హోటల్ ఈజ్ బ్యాక్.. దేబ్జానీకి కాబోయే భర్తగా ముఖేష్!
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లో ఇన్ని వారాలకు ఎంటర్ టైన్మెంట్ కిక్ దక్కేలా కనిపిస్తోంది. ఇన్ని రోజులూ గొడవలు, వాగ్వాదాలు, బూతులతో సాగిన షోలో ఇప్పుడు హోటల్ కాన్సెప్ట్ వచ్చేసింది. దీంతో ఇప్పటికైనా నవ్వించండి బాబూ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఎట్టకేలకు ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ కనిపించేలా ఉంది. బిగ్ బాస్ హిస్టరీలో మోస్ట్ ఫన్ సెగ్మెంట్ అయిన బిగ్ బాస్ హోటల్ కాన్సెప్ట్ ఇప్పుడు పదో సీజన్ లోకి వచ్చింది. ఇప్పటికైనా కంటెస్టెంట్లు కాస్త ఎంటర్ టైన్మెంట్ పంచుతారేమో చూడాలి.

బిగ్ బాస్ 10 హోటల్
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో హోటల్ సెగ్మెంట్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఎనిమిదో వారంలో హోటల్ థీమ్ ను ప్రవేశపెట్టారు. ఇందులో మూడు గ్రూప్ లుగా కంటెస్టెంట్లను డివైడ్ చేశారు. ఓనర్స్, గెస్ట్, వర్కర్స్ గా హౌస్ మేట్స్ విడిపోయారు. ఇక హోటల్లో ఆతిథ్యం ప్రకారం వర్కర్స్, ఓనర్స్ కు గెస్ట్ లు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది.
దేబ్జానీ భర్తగా ముఖేష్
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో దేబ్జానీ, ముఖేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దేబ్జానీ అంటేనే ముఖేష్ కు పడటం లేదు. దేబ్జానీ ఏది మాట్లాడినా ముఖేష్ దాన్ని గొడవగానే క్రియేట్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడు బిగ్ బాస్ వీళ్లతో ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లాన్ చేశాడు.
బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో దేబ్జానీకి కాబోయే భర్తగా ముఖేష్ ను సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. వీళ్లు ఈ హోటల్ కు గెస్ట్ లుగా వస్తారు. వీళ్ల మధ్యలోకి ఓనర్లలో ఒకరైన వర్షిణి వచ్చినట్లు లేెటెస్ట్ ప్రోమోలో కనిపించింది.
ఓటింగ్ ఇలా
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఎనిమిదో వారంలో అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే వర్షిణి, శివ డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. లైవ్ ఓటింగ్ ప్రకారం వీళ్లు లాస్ట్ రెండు స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా వర్షిణి ఓటింగ్ లో లీస్ట్ ప్లేస్ లో ఉంది. ఆమెకు జనాలు ఎక్కువగా ఓట్లు వేయలేదని తెలిసింది.
ఎలిమినేషన్ ఎవరు?
బిగ్ బాస్ లో ఏడో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. దక్షి, శాలిని హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఎనిమిదో వారంలో వర్షిణి, సుధీర్ లో ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ వారం వర్షిణి ఎలిమినేట్ అయేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఓటింగ్ లో రోహిత్ టాప్ లేపుతున్నాడు. త్రిగుణ్ నామినేషన్లో లేకపోవడంతో రోహిత్ కు ఎక్కువ ఓట్లు పడుతున్నాయని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


