Bigg Boss 10 Telugu: మిథిలేష్‌కు జాక్‌పాట్‌.. వంశీకి ఎలిమినేష‌న్ గండం.. ముఖేష్‌కు టెన్షన్.. వీళ్లు బిగ్ బాస్ విన్న‌ర్సా?

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సరికొత్త మలుపు తీసుకుంది. ఈ పాపులర్ రియాలిటీ షో హిస్టరీ చరిత్రలోనే కేవలం రెండు రోజులే హౌస్ లో ఉండి రూ.15 లక్షలకు పైగా డబ్బుతో బయటకు వచ్చేశాడు మిథిలేష్. అతను సూట్ కేస్ ఎంచుకోవడంతో టెంపర్ వంశీ ఎలిమినేషన్ గండం నుంచి బయటపట్టాడని టాక్.

Published on: Sep 27, 2026, 17:17:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హిస్టరీలోనే సరికొత్త ట్విస్ట్ లతో ఈ 10వ సీజన్ గేమ్ సాగుతోంది. ఫస్ట్ వీక్ లోనే డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ మొదలు ఈ సీజన్ అంచనాలకు అందని స్థాయిలో దూసుకెళ్తోంది. తాజాగా రూ.15 లక్షలతో మిథిలేష్ బయటకు రావడం ఈ బిగ్ బాస్ 10 సీజన్ పై ఉత్కంఠను మరింత పెంచింది.

మిథిలేష్‌కు జాక్‌పాట్‌..ఎలిమినేష‌న్ గండం త‌ప్పించుకున్న టెంప‌ర్ వంశీ..వీళ్లు బిగ్ బాస్ విన్న‌ర్సా? (youtube/starmaa)
మిథిలేష్‌కు జాక్‌పాట్‌..ఎలిమినేష‌న్ గండం త‌ప్పించుకున్న టెంప‌ర్ వంశీ..వీళ్లు బిగ్ బాస్ విన్న‌ర్సా? (youtube/starmaa)

మిథిలేష్ జాక్ పాట్

బిగ్ బాస్ హిస్టరీలో అసలైన జాక్ పాట్ అంటే ఇదే. కేవలం రెండు రోజులు పూర్తిగా హౌస్ లో ఉన్న మిథిలేష్ ఏకంగా రూ.15 లక్షలకు పైగా డబ్బుతో బయటకు వచ్చేశాడు. టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ వీక్ లో భాగంగా రూ.15 లక్షల ఆఫర్ కు టెంప్ట్ అయి మిథిలేష్ ఎగ్జిట్ ఇచ్చాడు.

సోషల్ మీడియా రియాక్షన్

మిథిలేష్ డబ్బుతో బయటకు వెళ్లడంపై సోషల్ మీడియాలో రియాక్షన్లు వెల్లువెత్తుతున్నాయి. మిథిలేష్ స్మార్ట్ డిసిషన్ తీసుకున్నాడని మెజారిటీ నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ మిథిలేష్ బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడో లేదో అనే క్లారిటీ లేదు. అసలే వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో రూ.15 లక్షల సూట్ కేసు ప్లస్ బిగ్ మూవీ ఆఫర్ తో బయటకు వెళ్లడం నిజంగా తెలివైన నిర్ణయమని అంటున్నారు.

టెంపర్ వంశీ లక్కీ

బిగ్ బాస్ 10 తెలుగులో ఇప్పటివరకూ టెంపర్ వంశీ లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వారం ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న అతను హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేవాడని అంటున్నారు. వంశీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కోసం ఏర్పాట్లు కూడా చేశారంటా. కానీ మిథిలేష్ డబ్బు ఆఫర్ కు ఓకే చెప్పి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.

మిథిలేష్ ఈ వారం ఎగ్జిట్ అయ్యాడు కాబట్టి మరో నామినేషన్ ఉండదని సమాచారం. అందుకే టెంపర్ వంశీకి ఎలిమినేషన్ గండం గడిచిందనే టాక్ వినిపిస్తోంది. మిథిలేష్ వెళ్లిపోయిన కారణంగా టెంపర్ వంశీకి హౌస్ లో కొనసాగే ఛాన్స్ దక్కిందని తెలిసింది. అందుకోసం ముఖేష్ గౌడ్ టెన్షన్ తీసుకున్నాడని సమాచారం.

విన్నర్స్ మనీ

ఇక బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ప్రైజ్ మనీలో నుంచి మిథిలేష్ రూ.15 లక్షలు తీసుకెళ్లడంతో కొందరు హౌస్ మేట్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. వీళ్లలో త్రిగుణ్, ముఖేష్ గౌడ ముందున్నారు. ప్రైజ్ మనీ తీసుకెళ్తానంటే ఎందుకు ఓకే చెప్పారని చేతులు ఎత్తినవాళ్లపై మండిపడుతున్నారు. అది నా ప్రైజ్ మనీ అంటే నా ప్రైజ్ మనీ అని గొడవ పడుతున్నారు. ఇప్పుడే బిగ్ బాస్ టైటిల్ గెలిచేసినట్లు బిహేవ్ చేస్తున్నారనే ట్రోల్స్ వస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More