Bigg Boss Rohit elimination: బ్యాన్ బిగ్ బాస్- రోహిత్ ఎలిమినేషన్‌పై భగ్గుమంటున్న నెటిజన్లు- ఇదంతా బిగ్ బాస్ టీమ్ స్కెచ్?

Bigg Boss Rohit elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రోహిత్ ఎలిమినేషన్ ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. మేనేజ్‌మెంట్ పార్షియల్ నిర్ణయాలను ప్రశ్నించినందుకే రోహిత్‌ను కావాలని బయటకు పంపేశారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Published on: Nov 2, 2026, 05:51:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss Rohit elimination: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ రోజుకో మలుపు తిరుగుతోంది. ముందెన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదటి వారం నుంచే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరుతెచ్చుకున్న రోహిత్ నాయుడు ఎలిమినేషన్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ప్రేక్షకుల ఓటింగ్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ టీమ్ కేవలం తమ ఇష్టాయిష్టాల కోసమే రోహిత్‌ను ఎలిమినేట్ చేసిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

బ్యాన్ బిగ్ బాస్- రోహిత్ ఎలిమినేషన్‌పై భగ్గుమంటున్న నెటిజన్లు- ఇదంతా బిగ్ బాస్ టీమ్ స్కెచ్?
బ్యాన్ బిగ్ బాస్- రోహిత్ ఎలిమినేషన్‌పై భగ్గుమంటున్న నెటిజన్లు- ఇదంతా బిగ్ బాస్ టీమ్ స్కెచ్?

రోహిత్ చేసిన తప్పేంటి?

బిగ్ బాస్ హౌస్‌లో ఏది తప్పో, ఏది ఒప్పో ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నైజం రోహిత్‌ది. బిగ్ బాస్ యాజమాన్యం, అలాగే వీకెండ్స్‌లో హోస్ట్ తీసుకునే కొన్ని ఏకపక్ష నిర్ణయాలను, పార్షియాలిటీని రోహిత్ చాలాసార్లు ధైర్యంగా ప్రశ్నించాడు. ఎవరికీ భయపడకుండా అతడు లాజికల్‌గా మాట్లాడటం మేనేజ్‌మెంట్‌కు నచ్చలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో గీతూ, శ్రీజ విషయంలో కూడా బిగ్ బాస్ టీమ్ ఇలాగే వ్యవహరించిందని, ఎంత ఆడియన్స్ సపోర్ట్ ఉన్నా సరే తమకు నచ్చకపోతే బయటకు పంపించేయడం వాళ్లకు అలవాటుగా మారిందని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

డబుల్ ఓటింగ్ కుట్ర!

గేమ్‌లో రోహిత్‌ను హైలైట్ కాకుండా చేసేందుకు బిగ్ బాస్ టీమ్ మొదటి నుంచీ ప్రయత్నించిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రోహిత్‌ను రెడ్ టీమ్‌లో వేసి, ఆ టీమ్‌కు ఎలాంటి ప్రాముఖ్యత ఉన్న టాస్కులు ఇవ్వకుండా కావాలనే సైడ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అంతటితో ఆగకుండా, శుక్రవారం హౌస్‌మేట్స్ ఓటింగ్ పూర్తయిన తర్వాత కూడా మళ్లీ ఆదివారం రెండోసారి హౌస్‌మేట్స్‌తో ఓటింగ్ వేయించి మరీ రోహిత్‌ను అన్యాయంగా ఎలిమినేట్ చేయడం పక్కా కుట్రేనని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదంతా టీఆర్పీ స్టంట్ కోసమేనా?

"బిగ్ బాస్ అంటేనే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం.. కప్పు గెలిచినా గెలవకపోయినా ఆడియన్స్ హార్ట్స్ ఎలా గెలవాలో రోహిత్ చూపించాడు" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రోహిత్ ఎలిమినేషన్ వెనుక పెద్ద టీఆర్పీ స్టంట్ ఉందనే వాదన కూడా ఉంది. రోహిత్ రీ ఎంట్రీ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న రోహిత్ ఎమోషనల్ ట్వీట్

తన ఎలిమినేషన్‌పై జరుగుతున్న రచ్చ నేపథ్యంలో రోహిత్ నాయుడు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. "అధికారం, పలుకుబడి కంటే మన కష్టం గట్టిగా మాట్లాడినప్పుడు.. ఎవరికి నిజమైన గుర్తింపు దక్కాలో ప్రేక్షకులకు బాగా తెలుసు. ప్రతి ప్రయాణానికి సమాన గౌరవం దక్కాలి. ఇప్పుడు మన గొంతును వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది" అంటూ రోహిత్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More