Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్- టాప్ ప్లేస్ కోసం ఆ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్-డబుల్ ఎలిమినేన్?
Bigg Boss 10 Elimination: అదిరిపోయే ట్విస్ట్ లు, అనుకోని మలుపులతో సాగుతున్న బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సెకండ్ వీక్ ఎలిమినేషన్లోనూ బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ పై ఓ లుక్కేయండి.
Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఫస్ట్ వీక్ లోనే ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. సెకండ్ వీక్ లో మళ్లీ అందులో నుంచి ఒకరిని తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సెకండ్ వీక్ కూడా ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.

డబుల్ ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఫస్ట్ వీక్ లోనే బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. మిడ్ వీక్ లోనే చరణ్, చైత్రను ఎలిమినేట్ చేశాడు. ఇప్పుడు సెకండ్ వీక్ లోనూ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. ఈ సారి ఓటింగ్ పరంగా లాస్ట్ 2లో ఇద్దరిని ఇంటికి పంపనున్నారని సమాచారం.
బిగ్ బాస్ 10 ఓటింగ్
బిగ్ బాస్ 10 ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే టాప్ ప్లేస్ కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య టఫ్ ఫైట్ సాగుతున్నట్లు కనిపిస్తోంది. అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్ లో రోహిత్, త్రిగుణ్ కొద్ది తేడాతో టాప్ 1, 2 ప్లేసుల్లో కొనసాగుతున్నారు. ఒకసారేమో త్రిగుణ్, మరోసారి రోహిత్ టాప్ ప్లేస్ కు దూసుకొస్తున్నారు. వీళ్లకు 31 శాతానికి పైగా ఓట్లు పడుతున్నాయి.
వీళ్లు సేఫ్
ఇక బిగ్ బాస్ 10 తెలుగు సెకండ్ వీక్ లో మొత్తం 11 మంది నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఓటింగ్ లో మూడో ప్లేస్ నుంచి 9వ ప్లేస్ వరకు చూస్తే వరుసగా ముఖేష్ గౌడ, రాంప్రసాద్, దేబ్జానీ, శాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్ ఉన్నారు. వీళ్లలో ముఖేష్ 10.13 శాతం, రాంప్రసాద్ 7.86 శాతంతో బెటర్ పొజిషన్ లో ఉన్నారు.
దేబ్జానీ (5.23), శాలిని (3.88), ఝాన్సీ (2.38), సృష్టి (2.25), సుధీర్ (2.14) కు ఓటింగ్ శాతం ఇంకా పెరగాల్సి ఉంది.
డేంజర్ జోన్లో
ప్రస్తుతం బిగ్ బాస్ 10 తెలుగు అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం కృష్ణుడు, వర్షిణి డేంజర్ జోన్లో ఉన్నారని సమాచారం. వర్షిణికి 1.77 శాతం, కృష్ణుడికి 1.76 శాతం ఓటింగ్ ఉందని తెలిసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ వారం హౌస్ నుంచి కృష్ణుడు వెళ్లిపోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వర్షిణిని కూడా హౌస్ నుంచి పంపించేస్తారని తెలుస్తోంది.
అయితే పట్టుబట్టి మరీ వర్షిణిని ఈ సీజన్ కోసం తీసుకొచ్చారు. అలాంటిది ఇప్పుడే వర్షిణిని ఎలిమినేట్ చేసే పరిస్థితి లేదని మరో టాక్ కూడా ఉంది. మరి చివరకు ఏం జరుగుతుందో వీకెండ్ ఎపిసోడ్లో తేలిపోతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


