...
...
Next Story

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఇవాళ ఎలిమినేట్ అయేది ఎవరంటే? ఆ లేడీ కంటెస్టెంట్ అవుట్!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మరో సండే వచ్చేసింది. ఇవాళ ఒకరు హౌస్ నుంచి ఎగ్జిట్ కావాల్సిందే. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగినా.. చివరకు సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉందని తెలిసింది. ఇవాళ ఎలిమినేట్ అయ్యే లేడీ కంటెస్టెంట్ ఎవరో ఇక్కడ చూసేయండి.

Published on: Nov 22, 2026, 14:49:19 IST
Advertisement

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ ఫినాలే దిశగా అడుగులు వేస్తుండటంతో హౌస్‌లో పోటీ మరింత వేడెక్కింది. 11వ వారం ముగింపు దశకు చేరుకున్న వేళ మరో ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వారం కెప్టెన్ నరేశ్ మినహా ఇంట్లో ఉన్న మిగిలిన 11 మంది సభ్యులు నామినేషన్‌లో ఉండటంతో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు బయటకు వెళ్తారనే ఉత్కంఠ వారం పొడవునా కొనసాగింది.

బిగ్ బాస్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఇవాళ ఎలిమినేట్ అయేది ఎవరంటే? ఆ లేడీ కంటెస్టెంట్ అవుట్! (youtube/starmaa)
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఇవాళ ఎలిమినేట్ అయేది ఎవరంటే? ఆ లేడీ కంటెస్టెంట్ అవుట్! (youtube/starmaa)

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఫినాలేకు సమయం దగ్గరపడుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండటంతో ఈ వారం కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం బలంగా వినిపించింది. అయితే ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా మేకర్స్ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్‌తోనే సరిపెట్టుకున్నట్లు సమాచారం. ఆ ఒక్క ఎగ్జిట్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన నీతు మాస్టర్ అని తెలిసింది.

ఓటింగ్ లో ఎవరు టాప్?

ఈ వారం బిగ్ బాస్ నామినేషన్‌లో త్రిగుణ్, ముఖేశ్, దేబ్జానీ, అమన్, రామకృష్ణ, వర్షిణి, రామ్ ప్రసాద్, వంశీ, సుధీర్, శివ, నీతు మాస్టర్ ఉన్నారు. ఓటింగ్ మొదలైనప్పటి నుంచి త్రిగుణ్, ముఖేశ్ అగ్రస్థానాల్లో దూసుకుపోగా.. వారి తర్వాత దేబ్జానీ, అమన్, వర్షిణి సేఫ్ జోన్‌లో నిలిచారు. మరోవైపు రామ్ ప్రసాద్, వంశీ, సుధీర్, రామకృష్ణ, శివ, నీతూ మాస్టర్ డేంజర్ జోన్‌లోకి జారిపోయారు. ముఖ్యంగా చివరి స్థానాల్లో సుధీర్, రామకృష్ణ, శివ, నీతూ మధ్య గట్టి పోటీ నెలకొంది.

నటరాజ్ మాస్టర్ భార్యగా, కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు ఉన్న నీతూ 35వ రోజు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టారు. తొలి రోజుల్లోనే తనదైన ఫైర్ బ్రాండ్ శైలితో త్రిగుణ్, వంశీలతో నువ్వా నేనా అన్నట్లు వాగ్వాదాలకు దిగి అందరి దృష్టిని ఆకర్షించారు. 11వ వారం జరిగిన డిక్టేటర్ టాస్క్‌లోనూ త్రిగుణ్ టీమ్ నుంచి ముఖేశ్ టీమ్‌కు మారి తన అభిప్రాయాలను గట్టిగా వినిపించారు.

అయితే ఆటల కంటే మాటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, గొడవల్లో అదుపు తప్పి మాట్లాడటం ఆమెకు మైనస్‌గా మారాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా శివ, వర్షిణిలతో జరిగిన వివాదాలు ప్రేక్షకుల్లో కొంత నెగెటివిటీని పెంచాయి. ఫ్యామిలీ వీక్‌లో భర్త నటరాజ్, కూతురు వచ్చి ధైర్యం నింపడంతో ఫినాలే వరకు వెళ్తానని ధీమా వ్యక్తం చేసిన నీతూ, చివరకు 11వ వారంతోనే తన ప్రయాణాన్ని ముగించాల్సి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks