Bigg Boss Telugu 10: కులకడానికి అర్థం చెప్పిన నాగార్జున.. మగాడు కాడు ఏంటీ దేబ్జానీ.. కుండలు బద్ధలు కొట్టిన నాగార్జున!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మరోసారి కంటెస్టెంట్లకు క్లాస్ పీకడానికి హోస్ట్ నాగార్జున రెడీ అయ్యారు. ఈ శనివారం ఎపిసోడ్లో హౌస్ మేట్స్ పై ఆయన ఫైర్ అయ్యారు. తాజాగా రిలీజైన ఈ వీకెండ్ ప్రోమో వైరల్ గా మారింది. ముఖ్యంగా వర్షిణి, దేబ్జానీపై నాగ్ ఫైర్ అయ్యారు. 

Published on: Nov 7, 2026, 18:25:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి వీకెండ్ వార్ కు రంగం సిద్ధమైంది. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్లపై మళ్లీ ఫైర్ అయ్యారు. కుండలు బద్ధలు కొట్టి మరీ ఈ వారం లో కంటెస్టెంట్లు చేసిన తప్పులను నాగార్జున ఎత్తిచూపారు.

కులకడానికి అర్థం చెప్పిన నాగార్జున.. మగాడు కాడు ఏంటీ దేబ్జానీ.. కుండలు బద్ధలు కొట్టిన నాగార్జున! (youtube/starmaa)
కులకడానికి అర్థం చెప్పిన నాగార్జున.. మగాడు కాడు ఏంటీ దేబ్జానీ.. కుండలు బద్ధలు కొట్టిన నాగార్జున! (youtube/starmaa)

కులకడం ఏంటీ?

బిగ్ బాస్ తెలుగు 10 లేటెస్ట్ ప్రొమోలో వర్షిణిపై నాగార్జున ఫైర్ అవడం కనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ లో వంశీ, ముఖేష్, వర్షిణి, సుధీర్ మధ్య వర్డ్ వార్ జరిగింది. చెల్లెని పంపించి మూలన కూర్చొని కులకడం కాదని ముఖేష్ ను వంశీ అన్నాడు. దీంతో వంశీపై వర్షిణి, సుధీర్ ఫైర్ అయ్యారు.

వర్షిణిపై ఫైర్

ఈ టాపిక్ ను వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ప్రస్తావించారు. అసలు వంశీ అన్నదాంట్లో తప్పు ఏం ఉందని వర్షిణిని నాగ్ ప్రశ్నించారు. కులకడం అంటే వయ్యారాలు పోవడం అని నాగ్ అర్థం చెప్పారు. వంశీ మాటల్లో ఎలాంటి తప్పు లేదని సర్టిఫై చేసేశారు. దీంతో వర్షిణి, సుధీర్, ముఖేష్ నోరు మూసుకోక తప్పలేదు.

మగాడు కాదా?

ఇక టాస్క్ సందర్బంగా ముఖేష్ గౌడను దేబ్జానీ నానా మాటలు అన్నది. ఈ విషయంపైనా నాగార్జున ఫైర్ అయ్యారు. ఆటలో కసి ఉండాలి కానీ మాటల్లో కాదని చెప్పారు. ‘సాలా, మగాడు కాదు’ అనే మాటలు ఎందుకు అని దేబ్జానీని సూటిగా ప్రశ్నించారు. కోల్ కతా నుంచి వచ్చిన దేబ్జానీని కాళీ మాతలా ఆడమని ఎంకరేజ్ చేశారు.

ఈ వారం నామినేషన్లు

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ 9వ వారంలో అమన్, ముఖేష్, రాంప్రసాద్, వంశీ, వర్షిణి, శివ, సుధీర్, నరేష్, నీతు, దేబ్జానీ ఉన్నారు. వీళ్లలో నుంచి ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవడం ఖాయం. మరి ఆ ఒక్కరు ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది.

సీరియల్ హీరోనా?

బిగ్ బాస్ తెలుగు 10లో 9వ వారం అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే సీరియల్ హీరో శివ కుమార్ డేంజర్ జోన్లో ఉన్నాడు. అతను ఓటింగ్ లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ముఖేష్ గౌడ టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్నాడు. ఆ తర్వాత దేబ్జానీ, సుధీర్, వర్షిణి, అమన్, నరేష్, నీతు, రాంప్రసాద్, వంశీ వరుసగా లిస్ట్ లో ఉన్నారు. మరి ఈ వారం శివ ఎలిమినేట్ అవుతాడా? ఇంకా ఏదైనా ట్విస్ట్ చోటు చేసుకుంటుందా? అనేది వేచి చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More