Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లో వీక్ మొత్తం కంటెస్టెంట్లను ఆటను బట్టి వీకెండ్ ఎపిసోడ్లో వచ్చే నాగార్జున ఫైర్ అవడం, సలహాలివ్వడం, ప్రశంసించడం కామనే. కానీ ఈ బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఈ వీకెండ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందుకు స్పెషల్ కారణముంది.
బిగ్ బాస్ 10 హౌస్ లో రచ్చ

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ స్టార్టింగ్ నుంచే గొడవలు జరుగుతున్నాయి. కంటెస్టెంట్లు లిమిట్స్ దాటుతున్నారు. కానీ ఈ నాలుగో వారం మాత్రం రచ్చ వేరే లెవల్ కు వెళ్లిపోయింది. హౌస్ లోని కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు పడి తోసేసుకున్నారు, బూతులు తిట్టుకున్నారు. దీంతో ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఎలా రియాక్టవుతారోననే క్యూరియాసిటీ నెలకొంది.
నాగార్జున ఫైర్
ఆడియన్స్ వెయిటింగ్ కు ఎండ్ కార్డు వేస్తు శనివారం (అక్టోబర్ 3) ఎపిసోడ్ ఫస్ట్ ప్రోమోను మేకర్స్ రీసెంట్ గా వదిలారు. ఇందులో నాగార్జున కోపం మామూలుగా లేదు. కంటెస్టెంట్లపై ఆయన సీరియస్ అయ్యారు. అసలు ‘వాట్ ది హెల్ హ్యాపెనింగ్ ఇన్ దిజ్ హౌస్’ అంటూ మండిపడ్డారు.
ఇది హౌసేనా?
అసలు ఇది బిగ్ బాస్ హౌసేనా? మీరు కంటెస్టెంట్లా లేదా వీధి రౌడీలా? అని కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్ అయ్యారు. త్రిగుణ్, రోహిత్, అమన్ ను గెటౌట్ ఆఫ్ లివింగ్ ఏరియా అంటూ గార్డెన్ లోకి పంపించారు. ఇక కెప్టెన్ అంటూ తెగ బిల్డప్ ఇచ్చిన అపూర్వకు కూడా ఇచ్చిపడేశాడు నాగార్జున. డిజాస్టర్ కెప్టెన్ అని తిట్టేశారు.
అందుకే కన్నింగ్
కమెడియన్ రాంప్రసాద్ పైనా నాగార్జున కోపం చూపించారు. నామినేషన్ల విషయం డిస్కస్ చేయొద్దంటే ఎందుకు చేస్తున్నావ్, అందుకే నిన్ను కన్నింగ్ అంటున్నారని నాగ్ అన్నారు. ఇక శాలినిపైనా మండిపడ్డారు. ‘వాట్ ది ఎఫ్’ శాలిని అంటూ ఆమె హౌస్ లో అన్న బూతు మాటను నాగార్జున గుర్తుచేశారు.
{{/usCountry}}కమెడియన్ రాంప్రసాద్ పైనా నాగార్జున కోపం చూపించారు. నామినేషన్ల విషయం డిస్కస్ చేయొద్దంటే ఎందుకు చేస్తున్నావ్, అందుకే నిన్ను కన్నింగ్ అంటున్నారని నాగ్ అన్నారు. ఇక శాలినిపైనా మండిపడ్డారు. ‘వాట్ ది ఎఫ్’ శాలిని అంటూ ఆమె హౌస్ లో అన్న బూతు మాటను నాగార్జున గుర్తుచేశారు.
{{/usCountry}}ఆడియన్స్ మిమ్మల్ని అసహ్యించుకుంటే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు అంటూ కంటెస్టెంట్ల అందరికీ నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఎపిసోడ్లో ఏ రేంజ్ లో ఆయన ఆవేశం ఉంటుందో చూడాలి. ఈ ఎపిసోడ్లో హౌస్ లో అందరికీ నాగార్జున తన స్టైల్లో గట్టిగా ఇచ్చిపడేశారని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. మరి దీనికి కంటెస్టెంట్ల రియాక్షన్ ఎలా ఉంటుంది? తప్పు తెలుసుకుని వాళ్లు మారతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.