...
...
Next Story

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు 10.. దీపావళి బొనాంజా..ఈ వారం ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్..మామూలు షాక్ కాదు!

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్. ఈ వారం దీపావళి పండుగ సందర్భంగా హౌస్‌లో ఎలిమినేషన్ ఉండదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్న వర్షిణి, నీతూలకు బిగ్ బాస్ ఊహించని దీపావళి గిఫ్ట్ ఇచ్చి సేవ్ చేసినట్లు తెలుస్తోంది.

Published on: Nov 8, 2026, 16:24:26 IST
Advertisement

Bigg Boss 10 Elimination: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' తొమ్మిదో వారం మరింత ఆసక్తికరంగా మారింది. నామినేషన్స్, టాస్కులు, గొడవలతో వేడెక్కిన బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. కంటెస్టెంట్ల మధ్య పోటీ ఎలా ఉన్నా.. వీకెండ్ వచ్చేసరికి ఎలిమినేషన్ టెన్షన్ అందరిలోనూ మొదలవుతుంది. కానీ ఈసారి కింగ్ నాగార్జున కంటెస్టెంట్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

నాగార్జున భారీ ట్విస్ట్.. నో ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 10.. దీపావళి బొనాంజా..ఈ వారం ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్..మామూలు షాక్ కాదు! (youtube/starmaa)
బిగ్ బాస్ తెలుగు 10.. దీపావళి బొనాంజా..ఈ వారం ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్..మామూలు షాక్ కాదు! (youtube/starmaa)

ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో ఎలాంటి ఎలిమినేషన్ ఉండదని తెలిసింది. దీపావళి పండుగ స్పెషల్‌గా ఈ వీకెండ్‌ను పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దసరా పండుగ సమయంలో ఎలాగైతే ఎలిమినేషన్ రద్దు చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారో.. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా నాగార్జున ‘నో ఎలిమినేషన్’ బోర్డు తిప్పేస్తారని సమాచారం.

ఆ కంటెస్టెంట్లకు బిగ్ రిలీఫ్

ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ముకేష్ గౌడ, వంశీ, అమన్ లాంటి వారు ఓటింగ్ లో టాప్‌లో ఉండగా.. వర్షిణి, నీతూ మాస్టర్, శివ కుమార్, సుధీర్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో నిలిచారు. ముఖ్యంగా వర్షిణి, నీతూలలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన ఈ 'నో ఎలిమినేషన్' ట్విస్ట్‌తో వీరికి పెద్ద రిలీఫ్ లభించింది.

లక్కీ వర్షిణి

ఈ వారం ఎలిమినేషన్ లేకపోవడం కంటెస్టెంట్లకు తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చినా.. అది ఎంతో కాలం నిలవకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం హౌస్‌లో 13 మంది సభ్యులు ఉన్నారు. ఫినాలేకి టాప్ 5 మాత్రమే వెళ్లాలి. అంటే రాబోయే ఐదు వారాల్లో దాదాపు ఎనిమిది మంది ఎలిమినేట్ అవ్వాలి.

దీన్ని బట్టి చూస్తే రాబోయే వారాల్లో కచ్చితంగా రెండు మూడు డబుల్ ఎలిమినేషన్స్ (Double Elimination) ఉండటం గ్యారెంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. కంటెస్టెంట్లకు బిగ్ బాస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని టాక్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks