...
...
Next Story

Bigg Boss 10 Telugu Nominations: పీకలు పిసుక్కోమని ఎవరూ చెప్పరు-నరేష్ ఫైర్-ఈ వారం నామినేషన్లలో వీళ్లే-డబుల్ ఎలిమినేషన్!

Bigg Boss 10 Telugu Nominations: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ అయిదో వారంలో నామినేషన్ రచ్చ మొదలైంది. ఈ సారి నామినేషన్లలో జబర్దస్త్ నరేష్ కు కోపమొచ్చింది. అపూర్వకు అతను దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారో ఇక్కడ చూసేయండి. అలాగే ఈ సారి డబుల్ ఎలిమినేషన్ అని టాక్.

Published on: Oct 5, 2026, 11:23:43 IST
Advertisement

Bigg Boss 10 Telugu Nominations: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యంగా లాస్ట్ వీక్ లో అయితే హౌస్ లో రచ్చ మామూలుగా లేదు. కంటెస్టెంట్లు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. ఇంకా ఎంతో డ్రామా జరిగింది. వీకెండ్ వచ్చిన నాగార్జున అందరికీ క్లాస్ పీకి వెళ్లారు.

మళ్లీ నామినేషన్ రచ్చ

పీకలు పిసుక్కోమని చెప్పరు-ఫైర్ అయిన నరేష్-ఈ వారం నామినేషన్లలో వీళ్లే-డబుల్ ఎలిమినేషన్! (youtube/starmaa)
పీకలు పిసుక్కోమని చెప్పరు-ఫైర్ అయిన నరేష్-ఈ వారం నామినేషన్లలో వీళ్లే-డబుల్ ఎలిమినేషన్! (youtube/starmaa)

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మళ్లీ నామినేషన్ రచ్చ మొదలైంది. అయిదో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగిందని టాక్. కంటెస్టెంట్ల ఒకరి తప్పులను మరొకరు చెప్తూ, మాటల యుద్ధానికి దిగారని సమాచారం. ఈ వారం హౌస్ నుంచి ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది.

నామినేషన్లో వీళ్లే

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ అయిదో వారంలో త్రిగుణ్, అమన్, రోహిత్, శాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేట్ అయ్యారని సమాచారం. అంతే కాకుండా ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ పక్కాగా ఉంటుందని టాక్. ఎందుకంటే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఈ వీకెండ్ లో వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇద్దరు కంటెస్టెంట్లను ఇంటికి పంపిస్తారని టాక్.

నరేష్ ఫైర్

అయిదో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా జబర్దస్త్ నరేష్ ఫుల్ ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా అపూర్వపై మాటలతో రెచ్చిపోయాడు. అమన్ ను నామినేట్ చేస్తున్నట్లు ఆటో రాంప్రసాద్ చెప్పాడు. అప్పుడు అమన్, త్రిగుణ్ మధ్య మళ్లీ మాటల యుద్ధం సాగింది.

నామినేషన్ ప్రాసెస్ లో వర్షిణి వర్సెస్ అపూర్వ మధ్య గొడవ పెద్దగానే సాగినట్లు తెలుస్తోంది. ముఖేష్ గౌడ ఏమో అపూర్వను నామినేట్ చేశాడు. కెప్టెన్ గా డామినెన్స్ చేయడానికి ట్రై చేశావనే కారణం చెప్పాడు. దీనికి కౌంటర్ గా వర్షిణి పేరును అపూర్వ మధ్యలోకి తీసుకొచ్చింది.

పేరుకే వర్షిణి కెప్టెన్ కానీ, అంతా నడిపించేది ముఖేష్ అనేలా అపూర్వ మాట్లాడింది. దీంతో వర్షిణికి చిర్రెత్తుకొచ్చింది. అపూర్వ దగ్గరకు వచ్చి మరీ ఏం అన్నావ్ అంటూ వర్షిణి గొడవ పెట్టుకుంది. డిజాస్టరస్ కెప్టెన్ అని అపూర్వను నాగార్జున అన్న మాటను వర్షిణి మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తూ గట్టిగట్టిగా అరిచింది. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేదేవరో వేచి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks