Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. హౌస్ లో ఏడో వారం నామినేషన్ ప్రక్రియతో మళ్లీ హీట్ పెరిగింది. ఈ సారి వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా నామినేట్ చేసే ఛాన్స్ అందుకోవడంతో నామినేషన్ ప్రక్రియ మరింత రసవత్తరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ నామినేషన్స్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఏడో వారం నామినేషన్లో ఫస్ట్ ఝాన్సీ వర్సెస్ ఆర్కేగా మాటల యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. శాలిని కాళ్లు పట్టుకోవడం తనకు నచ్చలేదని ఆర్కేను ఝాన్సీ నామినేట్ చేసింది. అసలు ఇది పాయింటే కాదంటూ, కాళ్ల పట్టుకోవడంలో తప్పు లేదంటూ ఆర్కే గట్టిగా ఆర్గ్యూ చేశాడు. ఝాన్సీ కూడా సింపతీ కోసం ట్రై చేస్తుందంటూ ఆమెలా యాక్ట్ చేసి మరీ చూపించాడు.
దమ్ముంటే నాతో మాట్లాడు
ఇక వర్షిణి టాస్క్ లు ఆడటం లేదంటూ నీతు ఫైర్ అయింది. దీనికి వర్షిణి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ముఖేష్ ను అడ్డుపెట్టుకొని హౌస్ లో సర్వైవ్ అవుతున్నావని వర్షిణిపై నీతు సంచలన కామెంట్లు చేసింది. దమ్ముంటే నాతో మాట్లాడు అంటూ వర్షిణి కూడా రివర్స్ లో ఛాలెంజ్ విసిరింది.
సీక్రెట్ రూమ్ లో శాలిని
మరోవైపు బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో డ్రామా మధ్యలో సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన శాలిని.. ఈ హౌస్ లో జరుగుతున్నదంతా చూస్తోంది. మధ్యలో కౌంటర్లు కూడా తనలో తాను అనుకుంటుంది. ఈ నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత శాలిని మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందని టాక్.
ఈ వారం వీళ్లు
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లో ఏడో వారం నామినేషన్లలో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని తెలిసింది. ఈ వారం నీతు, దక్షి, ఆర్కే, టెంపర్ వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, త్రిగుణ్ నామినేషన్లలో ఉన్నట్లు టాక్. వైల్డ్ కార్డు ఎంట్రీల్లో నీతు, దక్షి, ఆర్కే నామినేషన్స్ లో ఉన్నారని తెలిసింది.
{{/usCountry}}బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లో ఏడో వారం నామినేషన్లలో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని తెలిసింది. ఈ వారం నీతు, దక్షి, ఆర్కే, టెంపర్ వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, త్రిగుణ్ నామినేషన్లలో ఉన్నట్లు టాక్. వైల్డ్ కార్డు ఎంట్రీల్లో నీతు, దక్షి, ఆర్కే నామినేషన్స్ లో ఉన్నారని తెలిసింది.
{{/usCountry}}శాలిని సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయో చూడాలి. ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ దక్షి ఎలిమినేట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి వీకెండ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, ఏం ట్విస్ట్ ఉంటుందో వేచి చూడాలి.