Bigg Boss Telugu 10: బిగ్ బాస్ నుంచి షాకింగ్ ఎలిమినేషన్.. ఆ వైల్డ్ కార్డు బ్యూటీ అవుట్.. ఓటింగ్ ఏమో ఇలా!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలిసింది. ఓటింగ్ తో సంబంధం లేకుండా వైర్డు కార్డు బ్యూటీని ఇంటి నుంచి పంపించేశారని టాక్. మరి ఆ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ పై విమర్శలు ఎందుకు వస్తున్నాయో ఓ లుక్కేయండి. 

Published on: Nov 14, 2026, 16:05:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ శ్వేత నాయుడు జర్నీ ముగిసినట్లు తెలిసింది. ఈ సీజన్ పదో వారంలో హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈ ఎలిమినేషన్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ నుంచి షాకింగ్ ఎలిమినేషన్.. ఆ వైల్డ్ కార్డు బ్యూటీ అవుట్.. ఓటింగ్ ఏమో ఇలా! (youtubee/starmaa)
బిగ్ బాస్ నుంచి షాకింగ్ ఎలిమినేషన్.. ఆ వైల్డ్ కార్డు బ్యూటీ అవుట్.. ఓటింగ్ ఏమో ఇలా! (youtubee/starmaa)

శ్వేత షాకింగ్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి ఈ వారం శ్వేత నాయుడు ఎలిమినేట్ అవుతుందనే విషయం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎందుకంటే వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన శ్వేత ఇంత త్వరగా ఎగ్జిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. హౌస్ లో కూడా ఆమె యాక్టివ్ గానే కనిపించింది. కానీ ఈ సీజన్ లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న బిగ్ బాస్.. ఈ వారం శ్వేత ఎలిమినేషన్ తో మరో షాక్ ఇచ్చారని తెలిసింది.

ఓటింగ్ ఇలా

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో నామినేషన్లలో ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నరేష్, సుధీర్, నీతు, రాంప్రసాద్, శ్వేత, ఆర్కే, శివ కుమార్ ఉన్నారు. అనఫిషియల్, సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే శివ కుమార్ లాస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఓటింగ్ రిజల్ట్ పట్టించుకోకుండా శ్వేతను బయటకు పంపించారని సమాచారం.

బిగ్ బాస్ పై విమర్శలు

ఇక ఈ వారం హౌస్ లో ఫ్యామిలీ వీక్ సాగింది. కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో హౌస్ లో ఎమోషనల్ ఫీలింగ్స్ కనిపించాయి. వాతావరణం మొత్తం మారిపోయింది. కానీ ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ వ్యవహరించిన తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

ఫస్ట్ నుంచి వర్షిణి, ఆర్కే పేరెంట్స్ రారు అని బిగ్ బాస్ చెప్తూ వచ్చాడు. కానీ ఆఖర్లో వీళ్ల ఇద్దరి పేరెంట్స్ ను హౌస్ లోని యాక్టివిటీ ఏరియాకు తీసుకొచ్చారు. కానీ హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం మెజారిటీ ఓట్లు వర్షిణికి రావడంతో వాళ్ల అమ్మను మాత్రం ముందు లోపలికి పంపించారు.

మూడు గంటలు కూర్చోబెట్టి

అప్పుడు ఆర్కే వాళ్ల అమ్మ చాలా ఏడ్చారు. అయితే ఆ తర్వాత ఆర్కే వాళ్ల అమ్మను కూడా హౌస్ లోకి పంపించారని తెలిసింది. కానీ ఆమెను దాదాపు మూడు గంటల పాటు కూర్చోబెట్టారంటా. దీంతో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆటలేంటీ? ఈ చీప్ టీఆర్పీ స్టంట్లు ఏంటని బిగ్ బాస్ పై విమర్శలు వస్తున్నాయి.

ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్లో సందడి డబుల్ కానుంది. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ల కోసం సెలబ్రిటీలు స్టేజీపైకి రానున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More