...
...
Next Story

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లో షాకింగ్.. త్రిగుణ్ తీర్పు.. పెళ్ పెళ్ మని చెంపలు వాయించుకున్న టెంపర్ వంశీ!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. తెలుగు సినిమాల్లో విలన్ గా అదరగొట్టే టెంపర్ వంశీకి ఫుల్ కోపమొచ్చింది. ఆ కోపాన్ని తన మీదే చూపించుకుంటూ పెళ్ పెళ్ మని చెంపలు వాయించుకున్నాడు. ఓ టాస్క్ లో భాగంగా త్రిగుణ్ ఇచ్చిన నిర్ణయం తర్వాత ఇది జరిగింది.

Published on: Oct 15, 2026, 11:35:06 IST
Advertisement

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అయిదుగురు కొత్త కంటెస్టెంట్లు రావడంతో గేమ్ ఇంకా టఫ్ గా మారింది. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ కోసం బిగ్ బాస్ మూడు టీమ్స్ చేసి గేమ్స్ పెడుతున్నాడు. ఈ క్రమంలో టెంపర్ వంశీ తన చెంపలు వాయించుకోవడం షాకింగ్ గా మారింది.

బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు 10లో షాకింగ్.. త్రిగుణ్ తీర్పు.. పెళ్ పెళ్ మని చెంపలు వాయించుకున్న టెంపర్ వంశీ! (youtube/starmaa)
బిగ్ బాస్ తెలుగు 10లో షాకింగ్.. త్రిగుణ్ తీర్పు.. పెళ్ పెళ్ మని చెంపలు వాయించుకున్న టెంపర్ వంశీ! (youtube/starmaa)

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆరో వారంలో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. వైల్డ్ కార్డు గా వచ్చిన కంటెస్టెంట్లను టీమ్ రెడ్ గా బిగ్ బాస్ ఎంపిక చేశాడు. వీళ్లను ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్లుగా అనౌన్స్ చేశాడు. ఇక మిగిలిన హౌస్ మేట్స్ నుంచి టీమ్ గ్రీన్, టీమ్ బ్లూను సెలెక్ట్ చేశాడు.

టఫ్ ఫైట్

కెప్టెన్సీ రేసు కోసం టీమ్ గ్రీన్, టీమ్ గోల్డ్ మధ్య టఫ్ ఫైట్ సాగింది. చివరకు ఈ రెండు టీమ్స్ 4 పాయింట్లతో సమానంగా నిలిచింది. దీంతో విన్నర్ ను తేల్చేందుకు బోనస్ రౌండ్ నిర్వహించాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఓ ప్లేటు, దాని మీద బౌల్ ను దాచి పెట్టారు. వాటిని వెతికి పెడస్టల్ మీద పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు.

శివ వర్సెస్ వంశీ

ఈ టాస్క్ లో టీమ్ రెడ్ నుంచి శివ కుమార్, టీమ్ గ్రీన్ నుంచి టెంపర్ వంశీ పోటీపడ్డారు. ఈ గేమ్ కు త్రిగుణ్ సంచాలకుడిగా ఉన్నాడు. అయితే ఫస్ట్ వంశీనే ఆ ప్లేట్, బౌల్ ను కనిపెట్టాడు. కానీ పెడస్టల్ మీద పెట్టకుండా బెల్ కొట్టాడు.

చేతులారా గేమ్ ఓడిపోవడంతో వంశీకి తన మీదనే కోపం వచ్చింది. అందకే చెంపలను పెళ్ పెళ్ మని వాయించుకున్నాడు. అతను చెంపల మీద కొట్టుకోవడంతో శివ, త్రిగుణ్ సహా హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. వద్దు వంశీ సార్ అని శివ చెప్పినా కూడా వంశీ మరోసారి కొట్టుకున్నాడు. ఆ తర్వాత వంశీ, త్రిగుణ్ ఇద్దరూ కలిసి ఎమోషనల్ అయ్యారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks