...
...
Next Story

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10లో ట్రయాంగిల్ లవ్.. లవ్ కంటెంట్ కోసమే అపూర్వ వచ్చిందన్న శాలిని.. నాగార్జున షాక్!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ వైరల్ అవుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అపూర్వ, శాలిని, రోహిత్ మధ్య బాండింగ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా అపూర్వ సీక్రెట్ ను శాలిని బయటపెట్టడంతో హోస్ట్ నాగార్జున షాక్ అయ్యారు.

Published on: Oct 10, 2026, 15:40:47 IST
Advertisement

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటివరకూ హౌస్ లో జరుగుతున్న రచ్చకు ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ అనేది యాడ్ అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అపూర్వ, శాలిని, రోహిత్ మధ్య రిలేషన్ షిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా శాలిని ఓ సీక్రెట్ బయటపెట్టింది.

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో

బిగ్ బాస్ 10లో ట్రయాంగిల్ లవ్.. లవ్ కంటెంట్ కోసమే అపూర్వ వచ్చిందన్న శాలిని.. నాగార్జున షాక్! (youtube/starmaa)
బిగ్ బాస్ 10లో ట్రయాంగిల్ లవ్.. లవ్ కంటెంట్ కోసమే అపూర్వ వచ్చిందన్న శాలిని.. నాగార్జున షాక్! (youtube/starmaa)

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లోకి అపూర్వ వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన తర్వాత ఓ మంచి అబ్బాయి ఉంటే చూడమని రాంప్రసాద్ కు అపూర్వ చెప్పింది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా శనివారం (అక్టోబర్ 10) ప్రోమోలో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై రాంప్రసాద్ ను నాగార్జున అడగ్గా.. శాలిని సంచలన విషయం చెప్పింది.

లవ్ కంటెంట్ కోసమే

అపూర్వ బిగ్ బాస్ హౌస్ లోకి లవ్ కంటెంట్ కోసమే వచ్చిందనే అర్థం వచ్చేలా శాలిని మాట్లాడింది. అపూర్వ రాగానే రోహిత్ తో మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా శాలిని బయటపెట్టింది. ‘‘బయట మనది హిట్ పెయిర్ కదా. మనం కలిసి ఉందాం. శాలిని, నీకు సెట్ కాదని’’ రోహిత్ కు అపూర్వ చెప్పిందని శాలిని సీక్రెట్ రివీల్ చేసింది.

నాగార్జున షాక్

అపూర్వ ఏమో తాను లవ్ కంటెంట్ కోసం హౌస్ లోకి రాలేదని చెప్పింది. కానీ శాలిని ఏమో ఆమె మాటలు అబద్ధాలు అన్నట్లు మాట్లాడింది. దీంతో నాగార్జున షాక్ అయ్యారు. అసలు హౌస్ లో ఏం జరుగుతుందో అన్నట్లు మాట్లాడారు. మొత్తానికి రోహిత్, శాలిని, అపూర్వ లవ్ ట్రయాంగిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

శాలినికి క్లాస్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో హౌస్ లో ఇప్పటికే ఓ లవ్ ట్రాక్ ఏర్పడిందని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. శాలిని, రోహిత్ మధ్య బాండ్ ఫామ్ అయిందని అంటున్నారు. జీవితంలో రోహిత్ లాంటి వ్యక్తి ఉండాలని చెప్పిన శాలిని.. అప్పటి నుంచి అతనితోనే ఉంటుంది. వీళ్ల హగ్ లు, ముచ్చట్లు హాట్ టాపిక్ గా మారాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks