...
...
Next Story

Bigg Boss Telugu 10: వైల్డ్ కార్డు ఎంట్రీ అయినా తగ్గేదేలే.. వామ్మో అంతనా? బిగ్ బాస్ 10 కొత్త కంటెస్టెంట్ల రెమ్యునరేషన్!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో వైల్డ్ కార్డు స్టార్మ్ వచ్చేసింది. వైల్డ్ ఫైర్ పేరుతో అయిదుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. దీంతో గేమ్ మరింత టఫ్ గా మారనుంది. మరి వైల్డ్ కార్డుతో హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో ఇక్కడ చూసేయండి.

Published on: Oct 12, 2026, 09:55:15 IST
Advertisement

Bigg Boss Telugu 10 Remuneration: బిగ్‌ బాస్ తెలుగు 10వ సీజన్ ఆరో వారంలోకి అడుగుపెట్టడంతో ఆట మరింత రసవత్తరంగా మారింది. నిర్వాహకులు ఊహించని విధంగా ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఒకేసారి హౌస్‌లోకి పంపించారు. బుల్లితెర నటుడు శివ కుమార్, డ్యాన్సర్ నీతు నటరాజ్, 'ఢీ' ఫేమ్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నవరసాలు ఆర్కే (రామకృష్ణ), నటి దక్షి గుత్తికొండ రాకతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

బిగ్ బాస్ రెమ్యునరేషన్

వైల్డ్ కార్డు ఎంట్రీ అయినా తగ్గేదేలే.. వామ్మో అంతనా? బిగ్ బాస్ 10 కొత్త కంటెస్టెంట్ల రెమ్యునరేషన్! (x/starmaa)
వైల్డ్ కార్డు ఎంట్రీ అయినా తగ్గేదేలే.. వామ్మో అంతనా? బిగ్ బాస్ 10 కొత్త కంటెస్టెంట్ల రెమ్యునరేషన్! (x/starmaa)

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఒకేసారి అయిదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ ఫైర్ అంటూ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ల రెమ్యునరేషన్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చినప్పటికీ ఈ కంటెస్టెంట్లకు అదిరిపోయే రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్.

హైయ్యస్ట్ అతనికే

వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో సీరియల్ హీరో శివ కుమార్‌కు అత్యధిక పారితోషికం అందుతున్నట్లు బుల్లితెర వర్గాల సమాచారం. 'నిన్ను కోరి' సీరియల్ ద్వారా ఫేమస్ అయిన శివ కుమార్ కోసం మేకర్స్ భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా అంచనాల ప్రకారం, ఇతనికి వారానికి దాదాపు రూ.3 లక్షల వరకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని సమాచారం.

లేడీ కంటెస్టెంట్లకు ఇలా

ఇక లేడీ కంటెస్టెంట్లు అయిన శ్వేతా నాయుడు, నీతు నటరాజ్, దక్షి గుత్తికొండల పారితోషికాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. డాన్స్ రియాలిటీ షో 'ఢీ' ద్వారా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న శ్వేతా నాయుడుకు, మోడల్ కమ్ నటి అయిన దక్షి గుత్తికొండకు గ్లామర్ కోటా కింద మంచి డిమాండ్ ఉంది.

మరోవైపు యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవరసాలు ఆర్కే (రామకృష్ణ) రెమ్యునరేషన్ కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే ఉంది. కామనర్ కేటగిరీ కంటెస్టెంట్లకు వారానికి రూ.70 వేల వరకు లభిస్తుండగా... ఆర్కే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కావడంతో ఇతనికి వారానికి రూ.1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఐదుగురు వైల్డ్ కార్డుల రాకతో ఇప్పటివరకు నడుస్తున్న గ్రూపుల ఆట తలకిందులయ్యేలా ఉందనే టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో గేమ్ ఇకపై మరింత టఫ్ గా మారుతుందనే అంచనాలున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks