బిగ్ బాస్ 9 తెలుగులో 8 వారాలు పూర్తయ్యాయి. గత వారం దివ్వెల మాధురి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్లలో సంజన్ వర్సెస్ రీతు మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో డీమాన్ పవన్ తో ఉన్న రిలేషన్ షిప్ పై రీతు క్లారిటీ ఇచ్చింది.
బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్

బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం నామినేషన్స్ ప్రక్రియ హోరాహోరీగా మారింది. కంటెస్టెంట్ల ఫొటోలోను ఒక్కో టెడ్డీ బేర్ మీద ఉంచారు. కంటెస్టెంట్లు తమ టెడ్డీ బేర్ కాకుండా ఇతరుల ఫొటో ఉన్న టెడ్డీ బేర్ ను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లాలి. చివరగా ఎవరు మిగిలితే వాళ్లతో పాటు వాళ్ల దగ్గరున్న టెడ్డీ బేర్ పై ఉన్న ఫొటోలోని కంటెస్టెంట్ నామినేషన్లలోకి వస్తారు. ఆ తర్వాత తమ రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది. చివరకు హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం నామినేషన్ నిర్ణయిస్తారు.
రీతు వర్సెస్ సంజన
9వ వారం నామినేషన్లలో రీతు చౌదరి వర్సెస్ సంజన గల్రానీ మాటల యుద్ధం జరిగింది. రీతు గురించి పాయింట్లు మాట్లాడుతూ డీమాన్ పవన్ గురించి చెప్పింది సంజన. ‘‘ఫస్ట్ డే నుంచి నేను ఏదైనా చేస్తే ఒంటరిగా, ఒక సోలో ప్లేయర్ గానే చేశాను. ఎక్కడో రీతు ఆటలో డీమాన్ డెఫినెట్ కాంట్రిబ్యూషన్ ఉంది. అది మనందరికీ కనిపిస్తోంది’’ అని సంజన అంటుంది.
రిలేషన్ షిప్
వెంటనే రీతు రియాక్టవుతుంది. మీరు ఒక్క పర్సన్ తో మాట్లాడి సోలోగా ఉన్నాను, నాకు సపోర్ట్ లేదని మాట్లాడకండని రీతు అంటుంది. ‘మీకు ఎలా బాండ్స్ ఉన్నాయో నాకు ఈ హౌస్ లో ఒక బాండ్ ఉంది. ఆ బాండ్ మీకు రాంగ్ అయితే నేనేం చేయలేను’ అని క్లారిటీ గా చెప్పేసింది రీతు. రీతు కారణంగా డీమాన్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు అడుగు దూరంలో నిలిచాడని సంజన చెప్పింది.
సుమన్ సెల్ఫ్
{{/usCountry}}వెంటనే రీతు రియాక్టవుతుంది. మీరు ఒక్క పర్సన్ తో మాట్లాడి సోలోగా ఉన్నాను, నాకు సపోర్ట్ లేదని మాట్లాడకండని రీతు అంటుంది. ‘మీకు ఎలా బాండ్స్ ఉన్నాయో నాకు ఈ హౌస్ లో ఒక బాండ్ ఉంది. ఆ బాండ్ మీకు రాంగ్ అయితే నేనేం చేయలేను’ అని క్లారిటీ గా చెప్పేసింది రీతు. రీతు కారణంగా డీమాన్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు అడుగు దూరంలో నిలిచాడని సంజన చెప్పింది.
సుమన్ సెల్ఫ్
{{/usCountry}}ఆ తర్వాత తనూజ, సుమన్ నామినేషన్ జోన్లో ఉంటారు. నాకు ఏ రీజన్ లేదని తనూజ అంటుంది. తను ఫేక్ కాదని, తనకు మాస్క్ లేదంటుంది. సుమన్ సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని చెప్తాడు. ఎమోషనల్ అవుతాడు సుమన్ శెట్టి. ఈ వారం నామినేషన్లలోకి ఇమ్మాన్యుయేల్ కూడా వచ్చాడు.
ఈ వారం వీళ్లే
బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం నామినేషన్లలో 8 మంది ఉన్నారని తెలిసింది. భరణి, రాము, సుమన్, శ్రీనివాస్, కల్యాణ్, తనూజ, సంజన, ఇమ్మాన్యుయేల్ నామినేట్ అయ్యారని సమాచారం. ఇన్ని రోజులూ ఇమ్మాన్యుయేల్ ఓటింగ్ సంజనాకు పడింది. ఇప్పుడు ఇమ్ము, సంజన ఇద్దరూ నామినేషన్లలో ఉన్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.