తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ.. ఏ బిగ్ బాస్ టీవీ రేటింగ్స్ టాప్ లో ఉన్నాయో తెలుసా? నాగార్జున షోకు షాక్

టీవీఆర్ (TVR) అంటే ఒక నిర్దిష్ట సమయంలో ఒక కార్యక్రమాన్ని చూస్తున్న టార్గెట్ ప్రేక్షకుల శాతాన్ని కొలవడం. ఇది ఆ షో ప్రజాదరణ, ప్రకటనల విలువను సూచిస్తుంది. మరి ప్రస్తుతం తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ బిగ్ బాస్ వర్షన్లలో ఏ షోకు ఎక్కువ రేటింగ్ ఉందో చూసేయండి. 

Published on: Oct 18, 2025, 14:50:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియాలో పాపులర్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఫస్ట్ హిందీలో స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం.. ఇలా ప్రాంతీయ భాషల్లోకి వచ్చేసింది. అన్ని భాషల్లోనూ ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. సీజన్ కు సీజన్ కు క్రేజ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ షో కొనసాగుతోంది. మరి వీటి టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.

బిగ్ బాస్ హోస్ట్ లు విజయ్ సేతుపతి, సల్మాన్, నాగార్జున
బిగ్ బాస్ హోస్ట్ లు విజయ్ సేతుపతి, సల్మాన్, నాగార్జున

టాప్ లో బిగ్ బాస్ మలయాళం

ప్రస్తుతం టీవీ రేటింగ్ ల పరంగా చూస్తే బిగ్ బాస్ మలయాళం టాప్ లో ఉంది. ఈ బిగ్ బాస్ మలయాళం సీజన్ 7 టీఆర్పీ ప్రస్తుతం 12.1 గా ఉంది. నంబర్ వన్ గా ఇది కొనసాగుతోంది. దీనికి సూపర్ స్టార్ మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది వారపు రోజుల్లో 7.4, వీకెండ్ లో 10.9 రేటింగ్‌ రాబడుతోంది. దీనికి కిచ్చా సుదీప్ హోస్ట్.

తెలుగు బిగ్ బాస్

ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు బిగ్ బాస్ కు షాక్ తప్పలేదని చెప్పొచ్చు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ను రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చూస్తారు. అయినా మలయాళం, కన్నడతో పోల్చుకుంటే టీఆర్పీ తక్కువే ఉంది. బిగ్ బాస్ 9 తెలుగు 11.1 రేటింగ్ తో మూడో స్థానంలో ఉంది. దీనికి నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 టీవీలో 3.4 కోట్ల మంది వీక్షకులను చేరుకుంది. ఈ తమిళ్ వెర్షన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా ఉన్నారు. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 ఈ వారం రేటింగ్స్‌లో 1.1 నుండి 1.3కి పెరిగింది. వీకెండ్ రేటింగ్స్ 1.8గా ఉన్నాయి. ఈ షోకు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్.

బిగ్ బాస్ రేటింగ్స్

VersionRating
Bigg Boss Malayalam12.1
Bigg Boss Kannada10.9
Bigg Boss Telugu11.1
Bigg Boss Tamil3.4
Bigg Boss Hindi1.8

టీవీఆర్ అంటే ఏమిటి?

టీవీఆర్ అంటే టెలివిజన్ రేటింగ్ లేదా టెలివిజన్ వీక్షకుల రేటింగ్. ఇది ఒక నిర్దిష్ట సమయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం లేదా ఛానెల్‌ను వీక్షించిన లక్షిత ప్రేక్షకుల శాతాన్ని కొలుస్తుంది. సాధారణంగా చెప్పాలంటే ఇది ఒక నిర్దిష్ట షోకు ఎంత మంది (మొత్తం సంభావ్య వీక్షకులలో) ట్యూన్ అయ్యారో చూపిస్తుంది. ఉదాహరణకు 5 టీవీఆర్ అంటే మొత్తం టీవీలు ఉన్న ప్రేక్షకులలో 5% మంది ఆ కార్యక్రమాన్ని చూశారని అర్థం.

ఒక షో కు దక్కే ప్రజాదరణ, ప్రకటనల విలువను అంచనా వేయడానికి టీవీ పరిశ్రమలో ఉపయోగించే కీలక కొలమానాలలో టీవీఆర్ ఒకటి. భారతదేశంలో బార్క్ (BARC) నూతన రేటింగ్ సిస్టమ్స్‌లో ఇప్పుడు దీని స్థానంలో టీవీటీ (టెలివిజన్ వీక్షకుల సంఖ్య వేలల్లో) లేదా ఏఎంఏ (సగటు నిమిషానికి ప్రేక్షకులు) వంటివి వచ్చాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More