ఈ ఏడాది ఇండియాలో కాంతార: ఛాప్టర్ 1, ఛావా, సయ్యారాలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. వందల కోట్లు వసూలు చేశాయి. కానీ వీటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభాలతో సంచలనం సృష్టించింది ఓ చిన్న గుజరాతీ మూవీ. ఈ సినిమా పేరు లాలో: కృష్ణ సదా సహాయతే. ఈ మూవీ గురించి తెలుసుకోండి.
అసలేంటీ మూవీ?

1975లో 'షోలే' థియేటర్లలో విడుదలై దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలుసు కదా. దేశవ్యాప్తంగా 50కి పైగా నగరాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. అయినప్పటికీ ఆ సమయంలో విడుదలైన ఓ తక్కువ బడ్జెట్ భక్తి సినిమా 'జై సంతోషి మా' కొన్ని ప్రాంతాల్లో 'షోలే' కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. 'జై సంతోషి మా' మూవీ 100 రెట్లకు పైగా లాభాలు ఆర్జించి, భారతీయ సినిమా చరిత్రలో ఒక కేస్ స్టడీగా మారింది.
దాదాపు అరవై ఏళ్లలో ఏ సినిమా కూడా ఆ రికార్డును అధిగమించలేదు. అయితే ఈ ఏడాది ఎలాంటి సూపర్ స్టార్స్ లేని ఒక సాదాసీదా గుజరాతీ మూవీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ సినిమా 150 రెట్లకు పైగా లాభాలను నమోదు చేసి, ఈ ఏడాదిలో అత్యధిక లాభాలను ఆర్జించిన మూవీగా నిలిచింది.
రూ.50 లక్షల బడ్జెట్.. రూ.75 కోట్ల వసూళ్లు
అక్టోబర్‌లో విడుదలైన గుజరాతీ మూవీ 'లాలో: కృష్ణ సదా సహాయతే' (Laalo: Krishna Sada Sahaayate) ఈ ఏడాది అతిపెద్ద థియేట్రికల్ సక్సెస్ స్టోరీలలో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో రూపొందించిన ఈ భక్తి ప్రధాన మూవీ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.75 కోట్ల వసూళ్లు రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడిపై ఏకంగా 150 రెట్లు రాబడిని అందించింది. దీంతో ఇది ఈ సంవత్సరంలో అత్యధిక లాభదాయకమైన భారతీయ చిత్రంగా నిలిచింది.
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూడు సినిమాలు కూడా లాభం విషయంలో దీనికి సాటి రాలేకపోయాయి. కాంతార: ఛాప్టర్ వన్ రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా.. రూ.850 కోట్లు వసూలు చేసింది. అంటే 7 రెట్లు లాభం.
{{/usCountry}}ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూడు సినిమాలు కూడా లాభం విషయంలో దీనికి సాటి రాలేకపోయాయి. కాంతార: ఛాప్టర్ వన్ రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా.. రూ.850 కోట్లు వసూలు చేసింది. అంటే 7 రెట్లు లాభం.
{{/usCountry}}ఇక ఛావా మూవీని రూ.90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తే.. రూ.808 కోట్లు వసూలు చేసింది. అంటే సుమారు 9 రెట్లు లాభం. సయ్యారా రూ.45 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన సినిమా కాగా.. రూ.500 కోట్లకుపైగా అంటే 13 రెట్లు లాభం ఆర్జించింది.
'లాలో: కృష్ణ సదా సహాయతే' గురించి
అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన 'లాలో' ఒక రిక్షా పుల్లర్ కథ. ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకున్న ఈ డ్రైవర్.. గతంలోని బాధలను తలుచుకుంటూ ఉంటాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అతనికి కనిపిస్తూ ఉంటాడు. అలా ఓ కొత్త జీవితం వైపు అతడు వెళ్లేలా ఎలా మార్గనిర్దేశం చేస్తాడన్నదే ఈ మూవీ కథ.
విడుదలైన మూడు వారాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా విజయ పరంపర కొనసాగుతోంది. నవంబర్ 26 నాటికి అంటే విడుదలైన ఆరు వారాల తర్వాత కూడా ఈ చిత్రం వసూళ్లు సాధిస్తూనే ఉంది. 'లాలో' చిత్రంలో రీవా రాచ్, శ్రుహద్ గోస్వామి, కరణ్ జోషి, మిష్టీ కడేచా ప్రధాన పాత్రల్లో నటించారు.