...
...
Next Story

Biker OTT: అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న శర్వానంద్ లేటెస్ట్ రేసింగ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Biker OTT: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బైకర్’ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. బైకర్ ఓటీటీ వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Apr 27, 2026, 12:25:27 IST
Advertisement

Biker OTT: వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ జోరు మీదున్నాడు. అతను నటించిన లేటెస్ట్ రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బైకర్’ థియేటర్లలో అలరించింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి రాబోతుంది. బైకర్ ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

బైకర్ ఓటీటీ రిలీజ్ డేట్

బైకర్ ఓటీటీ రిలీజ్ డేట్ (x/Netflix_INSouth)
బైకర్ ఓటీటీ రిలీజ్ డేట్ (x/Netflix_INSouth)

శర్వానంద్ హీరోగా నటించిన మూవీ ‘బైకర్’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. మే 1న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్‌ సోమవారం (ఏప్రిల్ 27) ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో బైకర్ స్ట్రీమింగ్ కానుంది.

రేసింగ్ బ్యాక్ డ్రాప్

ఇండియాలోనే ఫస్ట్ మోటో క్రాస్ మూవీగా బైకర్ థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శనే చేసింది. ఈ మూవీలో శర్వానంద్ కు జోడీగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. బైకర్ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించాడు. శర్వానంద్ కు తండ్రిగా, రేసింగ్ మెంటార్ గా నటించాడు.

బైకర్ మూవీకి అభిలాష్ రెడ్డి డైరెక్టర్. యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ ఈ మూవీని నిర్మించారు.

బైకర్ స్టోరీ

వికాస్ నారాయణన్ అలియాస్ విక్కీ (శర్వానంద్) ఇండియాలోనే టాప్ రేసర్. తండ్రి సునీల్ నారాయణన్ (రాజశేఖర్) శిక్షణలో విక్కీ రేసింగ్ పై పట్టు సాధిస్తాడు. ఒకప్పుడు రేసింగ్ లో అదరగొట్టిన సునీల్ నారాయణన్, ఇప్పుడు తన కొడుకును ప్రపంచ ఛాంపియన్ గా చూడాలనుకుంటాడు.

కట్ చేస్తే తన భార్య అనన్య (మాళవిక నాయర్), ఓ కొడుకుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు విక్కీ. ఓ గో కార్టింగ్ రేస్ ట్రాక్ నడుపుతుంటాడు. అయితే తన తండ్రికి జరిగిన అవమానం గురించి తెలిసి విక్కీ మళ్లీ రేసింగ్ స్టార్ట్ చేస్తాడు. అసలు విక్కీ రేసింగ్ ను ఎందుకు వదిలేశాడు? మళ్లీ ఎందుకు స్టార్ట్ చేశాడు? ఇందులో అనన్యతో లవ్ స్టోరీ ఏంటీ? అన్నది తెలియాలంటే ‘బైకర్’ మూవీ చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks