తమిళ వెర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘బైసన్’. ఈ మూవీతో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబట్టుకున్నాడు ధ్రువ్. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం కోసం ధ్రువ్ చాలా చెమటోడ్చాడు. తండ్రి బాటలో సాగుతూ హిట్లు అందుకోవాలని చూస్తున్న ధ్రువ్ కు బైసన్ మూవీ మంచి జోష్ ఇచ్చింది.
బైసన్ ఓటీటీ

ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ బైసన్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బైసన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా నవంబర్ 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సోమవారం (నవంబర్ 17) అఫీషియల్ గా ప్రకటించింది.
తెలుగులోనూ
బైసన్ మూవీ మొదట తమిళంలో థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు భాషలే కాకుండా కన్నడ, మలయాళం, హిందీలోనూ బైసన్ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ఇవాళ అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.3 రేటింగ్ ఉంది.
నెల తర్వాత ఓటీటీలోకి
బైసన్ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ కు మారి సెల్వరాజ్ డైరెక్టర్. స్టోరీ కూడా ఆయనదే. ఇందులో ధ్రువ్ విక్రమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించింది. దీన్ని అప్లాజ్ ఎంటర్ టైన్మెంట్, నీలమ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
బైసన్ కథ
తరతరాలుగా సామాజిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటరానితనం, వివక్ష అనేది జాతిని పీడిస్తోంది. ఇలాంటి కథనే కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తీసుకుని గొప్పగా ఆవిష్కరించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. 1990లో జరిగే కథనే బైసన్. చిన్నప్పటి నుంచి వనతి కిట్టన్ (ధ్రువ్ విక్రమ్)కు కబడ్డీ అంటే ఇష్టం. ఇంట్లోవాళ్లను ఒప్పించి కోర్టులో అడుగుపెడతాడు. అక్కడి నుంచి సొంత జట్టు, ఊరి జట్టు.. ఇలా అతని ప్రయాణం సాగుతుంది.
{{/usCountry}}తరతరాలుగా సామాజిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటరానితనం, వివక్ష అనేది జాతిని పీడిస్తోంది. ఇలాంటి కథనే కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తీసుకుని గొప్పగా ఆవిష్కరించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. 1990లో జరిగే కథనే బైసన్. చిన్నప్పటి నుంచి వనతి కిట్టన్ (ధ్రువ్ విక్రమ్)కు కబడ్డీ అంటే ఇష్టం. ఇంట్లోవాళ్లను ఒప్పించి కోర్టులో అడుగుపెడతాడు. అక్కడి నుంచి సొంత జట్టు, ఊరి జట్టు.. ఇలా అతని ప్రయాణం సాగుతుంది.
{{/usCountry}}కానీ అడుగడుగునా కిట్టన్ కు అడ్డంకులు, వివక్ష ఎదురవుతూనే ఉంటుంది. వీటన్నింటినీ దాటి ఆసియా క్రీడల్లో పోటీపడే భారత కబడ్డీ జట్టుకు ఎంపికవుతాడు. కానీ మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాదు. టోర్నీలో ఇండియా, పాక్ మ్యాచ్ రద్దవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కిట్టన్ ఇండియా టీమ్ కు ఆడాడా? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.