...
...
Next Story

Blast Movie Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 రచ్చ.. ‘బ్లాస్ట్’ యాక్షన్ థ్రిల్లర్‌ ను ఎందుకు చూడాలంటే?.. 5 కారణాలు

Blast Movie Netflix: ‘యాక్షన్ కింగ్’ అర్జున్ సర్జా లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకూడదనడానికి 5 కారణాలు ఇవే.

Published on: Jun 28, 2026, 05:32:12 IST
Advertisement

Blast Movie Netflix: ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్ సినిమాల హడావుడి ఎక్కువైంది. కానీ వాటికి భిన్నంగా ‘బ్లాస్ట్’ ఎందుకు అంతలా ట్రెండ్ అవుతుందో ఈ 5 పాయింట్స్ చూస్తే అర్థమవుతుంది.

1. కనెక్ట్ అయ్యే ఎమోషన్స్

నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 రచ్చ.. ‘బ్లాస్ట్’ యాక్షన్ థ్రిల్లర్‌.. మస్ట్ వాచ్ అనేందుకు 5 కారణాలు
నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 రచ్చ.. ‘బ్లాస్ట్’ యాక్షన్ థ్రిల్లర్‌.. మస్ట్ వాచ్ అనేందుకు 5 కారణాలు

ఇది అసాధారణ శక్తులున్న సూపర్ హీరో కథ కాదు. ఇందులో హీరో రాజారామ్ (అర్జున్) ఒక సాధారణ కరాటే ఇన్‌స్ట్రక్టర్. తన భార్య (అభిరామి), కూతురు (ప్రీతి ముకుందన్) లతో కలిసి ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతుంటాడు.

అయితే, ఒక పవర్‌ఫుల్ కార్పొరేట్ మాఫియా వల్ల వీరి ప్రశాంతమైన జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు వచ్చాయి, ఒక సామాన్య కుటుంబం ఆ శక్తులపై ఎలా తిరగబడింది అనే పాయింట్ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంది.

2. ‘యాక్షన్ కింగ్’ వింటేజ్ మేజిక్!

గతంలో జెంటల్‌మేన్, ఒకే ఒక్కడు, కర్ణ వంటి చిత్రాలతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ స్టార్‌గా నిలిచిన అర్జున్ సర్జా.. ‘బ్లాస్ట్’ సినిమాతో తన లెగసీని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో ఆయన ఒక పక్క ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను పండిస్తూనే, మరోపక్క మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్‌లో తన వయసును మరపించే ఫిజికల్ ఫిట్‌నెస్‌తో అదరగొట్టారు.

3. రవి బస్రూర్ ‘హై-వోల్టేజ్’ బీజీఎం

మీరు ‘కేజీఎఫ్’, 'సలార్' సినిమాలు చూసి ఉంటే.. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసే ఉంటుంది. 'బ్లాస్ట్' సినిమాలో కూడా ఆయన అందించిన సంగీతం అతిపెద్ద అసెట్. ప్రతి ఫైట్ సీక్వెన్స్, ఎమోషనల్ బ్లాక్‌ను తన మార్క్ ఎలివేషన్స్‌తో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.

4. పవర్‌ఫుల్‌గా మహిళలు!

చాలా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకే పరిమితమవుతాయి. కానీ ఈ సినిమాలో అభిరామి, ప్రీతి ముకుందన్ పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా కూతురి పాత్రలో ప్రీతి ముకుందన్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్, స్టంట్స్ థియేటర్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ ను ఓటీటీలోనూ ఇస్తాయి.

5. డెబ్యూ డైరెక్టర్ స్క్రీన్‌ప్లే

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో అదరగొట్టిన బ్లాస్ట్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ లో జనాలు తెగ చూసేస్తున్నారు. అందుకే ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా నిలిచింది. ఈ తమిళ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe