...
...
Next Story

Blast Tv Premiere: సినీ లవర్స్ అలెర్ట్.. టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ తమిళ మూవీ బ్లాస్ట్.. ఎప్పుడు చూడాలంటే?

Blast Tv Premiere: చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన ‘బ్లాస్ట్’ మూవీ ఇప్పుడు టీవీలోకి రాబోతోంది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీని ఎప్పుడు? ఏ ఛానెల్ లో చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Nov 24, 2026, 12:02:29 IST
Advertisement

Blast Tv Premiere: ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర పెను విధ్వంసం క్రియేట్ చేసిన చిన్న సినిమాల్లో ‘బ్లాస్ట్’ పేరు కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు టీవీలోకి రాబోతుంది.

బ్లాస్ మూవీ టీవీ ప్రీమియర్

సినీ లవర్స్ అలెర్ట్.. టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ తమిళ మూవీ బ్లాస్ట్.. ఎప్పుడు చూడాలంటే? (x/StarMaa)
సినీ లవర్స్ అలెర్ట్.. టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ తమిళ మూవీ బ్లాస్ట్.. ఎప్పుడు చూడాలంటే? (x/StarMaa)

తమిళ సినిమాగా తెరకెక్కిన ‘బ్లాస్ట్’ మూవీ తెలుగులోనూ డబ్ అయిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఇప్పుడు టీవీలోకి రాబోతుంది. ఈ ఆదివారం (నవంబర్ 29) సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మాలో ఈ సినిమా ప్రీమియర్ కానుంది.

అఫీషియల్ అనౌన్స్ మెంట్

బ్లాస్ట్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవాళ (నవంబర్ 24) ఇవాళ వచ్చేసింది. ఈ సినిమా ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ కానున్నట్లు స్టార్ మా సోషల్ మీడియాలో ప్రకటించింది. యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ బ్లాస్టింగ్ డోస్ కు రెడీ కావాలంటూ పోస్టు పెట్టింది.

స్టోరీ ఏంటంటే?

రాజారామ్ (అర్జున్ సర్జా), నీలవేణి (అభిరామి) భార్యాభర్తలు. వీళ్ల పిల్లలు నీల (ప్రీతి ముకుందన్), ఇళంగో (వివేక్ ప్రసన్న). రాజారామ్ ఇంట్లోనే కరాటే స్కూల్ నడుపుతుంటాడు. తన పిల్లలకు కూడా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తాడు. రాజారామ్ తో పాటు కుటుంబంలోని అందరూ మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరినవాళ్లే.

బ్లాస్ట్ సినిమాను కొత్త దర్శకుడు సుభాష్ కె.రాజ్ తెరకెక్కించారు. కేవలం రూ.18 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 2026లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్లలో ఒకటిగా ఈ బ్లాస్ట్ మూవీ నిలిచింది.

అలరించే యాక్షన్ సీక్వెన్స్, అదరగొట్టే ప్రీతి ముకుందన్, అబ్బురపరిచే నటన కోసం ఈ ఆదివారం స్టార్ మాలో బ్లాస్ట్ చూసేయండి. ఇప్పటికే ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోనూ సత్తాచాటుతోంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks