...
...
Next Story

OTT Trending: ప్రపంచవ్యాప్తంగా ఎగబడి చూస్తున్న జనాలు-ఓటీటీలో సౌత్ సినిమా సత్తా-గ్లోబల్ నంబర్ వన్ గా యాక్షన్ థ్రిల్లర్

OTT Trending: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లీష్ సినిమాల విభాగంలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని గ్లోబల్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

Published on: Jul 13, 2026, 14:01:15 IST
Advertisement

OTT Trending: తమిళ పరిశ్రమలో ఈ ఏడాది సరికొత్త సంచలనం సృష్టించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్' (Blast) ఇప్పుడు ఓటీటీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపుతోంది. సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

బ్లాస్ట్ ఓటీటీ

తమిళ సినిమా సత్తా- గ్లోబల్ ఓటీటీ ట్రెండింగ్ నంబర్ వన్ (x/Netflix_INSouth)
తమిళ సినిమా సత్తా- గ్లోబల్ ఓటీటీ ట్రెండింగ్ నంబర్ వన్ (x/Netflix_INSouth)

చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బ్లాస్ట్ మూవీ ఓటీటీలోనూ బ్లాస్ట్ చేస్తోంది. ఇంగ్లీషేతర (Non-English) చిత్రాల విభాగంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మూవీలోని యాక్షన్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అందుకే ఎగబడి మరీ చూస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డుల వేట

నెట్‌ఫ్లిక్స్ బ్లాస్ట్ సినిమాను జూన్ 25 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చిన కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా మిలియన్ల కొద్దీ వీక్షణలను సొంతం చేసుకుంది. జూన్ 29 నుంచి జూలై 5 వరకు ఉన్న వారానికి గానూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 'బ్లాస్ట్' చిత్రం మొదటి స్థానంలో నిలిచింది.

ఇప్పటివరకు ఈ సినిమా సుమారు 18.1 మిలియన్ల వీక్షణ గంటలను (Hours Watched) నమోదు చేసి అత్యధిక ఆదరణ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ టాప్ టెన్ లిస్టులో ట్రెండ్ అవుతుండటం విశేషం.

కరాటే ఫ్యామిలీ కథాంశం

ఒక అవినీతి కార్పొరేట్ ముఠా, వారి కిరాయి హంతకులు ఒక గ్రామాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఈ కరాటే ఫ్యామిలీ వారితో ఎలా తలపడింది అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం. అర్జున్ సర్జా మార్షల్ ఆర్ట్స్ టీచర్‌గా తనదైన నటనతో మెప్పించగా, ఆయన భార్యగా అభిరామి, కూతురిగా ప్రీతి ముకుందన్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లలో అలరించారు. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ చేసిన ఫైట్ సీన్లు హాలీవుడ్ స్థాయిని తలపించాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

బాక్సాఫీస్ నుంచి ఓటీటీ వరకు బ్లాక్‌బస్టర్

కేవలం 18 కోట్ల రూపాయల పరిమిత బడ్జెట్‌తో నిర్మించిన బ్లాస్ట్ సినిమా థియేటర్లలో దాదాపు 76 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన ఫైట్ కొరియోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

హాలీవుడ్ క్లాసిక్స్ 'జాన్ విక్', 'కిల్ బిల్' చిత్రాల తరహాలో ఇందులో యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేశారంటూ అంతర్జాతీయ వీక్షకులు సైతం సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమాపై పోస్టులు పెడుతున్నారు. సబ్‌టైటిల్స్‌తో విదేశీ వీక్షకులు కూడా ఈ యాక్షన్ డ్రామాను ఎగబడి చూస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks