OTT Release:టీజరే ఇలా ఉంటే ఇక సిరీస్ ఎలా ఉంటుందో? మిస్ట‌రీ, స‌స్పెన్స్ వేరే లెవ‌ల్‌-ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ సీజ‌న్ 2

OTT Release: నెక్స్ట్ లెవల్ మిస్టరీ, సస్పెన్స్ తో ఓటీటీ ఆడియన్స్ కు అదిరే థ్రిల్ అందించేందుకు బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సిరీస్ టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. టీజరే ఇలా ఉంటే, ఇక సిరీస్ ఏ రేంజ్ లో ఉంటుందోననే కామెంట్లు వస్తున్నాయి. 

Published on: Oct 14, 2026, 09:02:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Release: కన్నడ డిజిటల్ స్క్రీన్‌పై సంచలనం సృష్టించిన బిగ్గెస్ట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'అయ్యన మనే' (Ayyana Mane) ఇప్పుడు సరికొత్త మిస్టరీతో మన ముందుకు వస్తోంది. రమేష్ ఇందిరా దర్శకత్వంలో, శృతి నాయుడు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ అక్టోబర్ 23, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 (ZEE5) ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.

టీజరే ఇలా ఉంటే ఇక సిరీస్ ఎలా ఉంటుందో? మిస్ట‌రీ, స‌స్పెన్స్ వేరే లెవ‌ల్‌-ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ సీజ‌న్ 2
టీజరే ఇలా ఉంటే ఇక సిరీస్ ఎలా ఉంటుందో? మిస్ట‌రీ, స‌స్పెన్స్ వేరే లెవ‌ల్‌-ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ సీజ‌న్ 2

సీజన్ 1 లో ఏం జరిగింది?

అయ్యన మనే వెబ్ సిరీస్ మొదటి సీజన్ మొత్తం ఆడియన్స్‌ను ఊపిరి బిగబట్టుకునేలా చేసింది. కథ విషయానికొస్తే.. జేజీ (ఖుషీ రవి) అనే యువతి దుష్యంత్ (అక్షయ్ నాయక) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని 'అయ్యన మనే' అనే ఒక పురాతనమైన, రహస్యాలు దాగి ఉన్న పెద్ద ఇంట్లోకి అడుగుపెడుతుంది.

అయితే ఆ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు కోడళ్లు అంతకుముందే వింత పరిస్థితుల్లో చనిపోయి ఉంటారు. జేజీ ఆ ఇంట్లోని నాల్గవ కోడలు. ఆ ఇంట్లో ఉన్న పవిత్రమైన 'కొండయ్య' విగ్రహం చుట్టూ, ఆ వంశం చుట్టూ ఉన్న శాపం ఏంటి? ఆ ముగ్గురు కోడళ్లు ఎలా చనిపోయారు? అనే నిజాలను తెలుసుకోవడానికి జేజీ చేసే సాహసమే మొదటి సీజన్. ఓటీటీలో ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ అప్పుడు అదరగొట్టింది.

సీజన్ 2లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లు

ఈ వెబ్ సిరీస్ లో సీజన్ 1 ముగిసే సమయానికి కొన్ని నిజాలు తెలిసినప్పటికీ, అసలైన పెద్ద మిస్టరీ అలాగే ఉండిపోయింది. ఇక సీజన్ 2 లో 'రహస్యం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని' బట్టబయలు చేయబోతున్నారు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ వెంటాడే ఆ అదృశ్య శక్తి ఏంటి?

వంశస్థుల చావుల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? అనే సరికొత్త ట్విస్టులతో ఈ సీజన్ సాగనుంది. ప్రతి ఎపిసోడ్ ఊహించని మలుపులతో మైండ్ ఫ్రీజ్ చేయడం ఖాయం.

లేటెస్ట్ టీజర్‌లో ఏం చూపించారు?

ఇటీవల విడుదలైన అయ్యన మనే వెబ్ సిరీస్ లేటెస్ట్ టీజర్ సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తోంది. టీజర్‌లో చీకటితో నిండిన ఆ పురాతన బంగ్లా, భయపెట్టే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వింత శబ్దాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

జేజీ కి ఎదురయ్యే కొత్త ప్రమాదాలు, కొండయ్య విగ్రహం ముందు జరిగే కొన్ని భయానక పూజల సీన్లు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. "నిజం అనుకున్నదంతా నిజం కాదు.. దాని వెనుక ఇంకో ఘోరం ఉంది" అనే రేంజ్‌లో టీజర్ కట్ చూపిస్తూ అంచనాలను పెంచేశారు.

ఓటీటీలో ఎందుకు చూడాలి?

సస్పెన్స్, క్రైమ్, సైకలాజికల్ మిస్టరీ జానర్లను ఇష్టపడేవారు అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్ ఇది. కేవలం హారర్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, మనుషుల మైండ్ గేమ్స్, ఎమోషన్స్, అద్భుతమైన విజువల్స్ ఈ అయ్యన మనే సిరీస్ సొంతం. థ్రిల్లింగ్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఇంట్లోనే కూర్చుని ఒక బెస్ట్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి అక్టోబర్ 23న జీ5లో ఈ సరికొత్త సీజన్‌ను వాచ్ చేయండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More