OTT Trending: ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్ హవా.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోను దాటి టాప్‌లోకి.. అసలు రహస్యం ఇదే!
OTT Trending: తెలుగు కమెడియన్ హర్ష చెముడు హీరోగా నటించిన ఆఫీస్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సంచలనం సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా డైలీ టాప్ 10 షోల జాబితాలో దేశంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోను సైతం దాటేసింది.
OTT Trending: తెలుగు ఓటీటీ స్పేస్‌లో ఒక ప్రాంతీయ వెబ్ సిరీస్ జాతీయ స్థాయి హిందీ కామిక్ షోను వెనక్కి నెట్టడం సాధారణమైన విషయం కాదు. హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (LAB) సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా డైలీ టాప్ 10 టీవీ షోల జాబితాలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓటీటీ
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న మోస్ట్ పాపులర్ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' (The Great Indian Kapil Show) కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కాీన ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్.. ఈ షోను సైతం దాటేసి అగ్రస్థానంలో నిలవడం ఓటీటీలో ఈ సిరీస్ సాధించిన అతిపెద్ద మైలురాయి.
సూపర్ రెస్పాన్స్
ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ రెంటింలోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ 6 ఎపిసోడ్ల కామెడీ సిరీస్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డిజిటల్ వీక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 చార్ట్స్ విడుదల కానుండటంతో ఈ సిరీస్ సాధించిన అధికారిక వ్యూయర్ షిప్ మినిట్స్ పై మరింత స్పష్టత రానుంది.
స్టోరీ ఇదే
'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి పాపులర్ టీవీ షోలలో పనిచేసిన అనుభవం ఉన్న బాబు డేగల ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. పల్నాడు జిల్లాకు చెందిన అమాయకపు పెళ్లికాని యువకుడు తేజ (హర్ష చెముడు), ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరడం, తన టీమ్ లీడ్ మధు (ఐశ్వర్య హోలక్కల్) తో అనుకోని పరిస్థితుల్లో 6 నెలలపాటు 'లివ్-ఇన్' అగ్రిమెంట్ చేసుకోవడం ఈ సిరీస్ ప్రధాన కథాంశం.
సిరీస్‌కు ప్రధాన బలాలు
హర్ష చెముడు సెటిల్డ్ యాక్టింగ్: పక్కింటి అబ్బాయి తరహా అమాయకత్వం, కామెడీ టైమింగ్, ముగింపులో వచ్చే ఎమోషనల్ పండించే విధానంతో హర్ష తన నటనతో అలరించారు.
హైపర్ ఆది & శ్రీవిద్య కామెడీ ట్రాక్: జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది మార్కు పంచ్ డైలాగులు, శ్రీవిద్య ఎనర్జెటిక్ యాక్టింగ్, జీవన్ కుమార్ ఆఫీస్ మేనేజర్ రోల్ కార్పొరేట్ ఆఫీస్ గోయర్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి.
5 భాషల్లో డబ్బింగ్: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఒరిజినల్‌తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉండటం వల్ల పాన్-ఇండియా రేంజ్‌లో వ్యూయర్‌షిప్ లభించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


