...
...
Next Story

Akshay Kumar: 15 మంది సాయంతో గాలిలో ఎగిరి తన్నడం నాకు నచ్చదు, రియల్ ఫైట్ చేయాలి.. కన్నప్ప శివుడు అక్షయ్ కుమార్ కామెంట్స్

Akshay Kumar About Real Action: నేటి కాలంలో యాక్షన్ సినిమాలన్నీ వీఎఫ్ఎక్స్ మాయాజాలంతో నిండిపోతున్నాయని, తనకు మాత్రం సహజసిద్ధమైన ఫైట్స్ చేయడమే ఇష్టమని కన్నప్ప శివుడు అక్షయ్ కుమార్ వెల్లడించారు. త్వరలో డూపులు, గ్రాఫిక్స్ లేకుండా పూర్తిస్థాయిలో అసలైన యాక్షన్ సినిమా చేస్తానని అక్షయ్ కుమార్ ప్రకటించారు.

Published on: Mar 30, 2026, 19:00:04 IST
Advertisement

బాలీవుడ్ యాక్షన్ స్టార్, అందరూ ప్రేమగా పిలుచుకునే ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ మళ్లీ తన పాత పంథాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేటి తరం సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వీఎఫ్ఎక్స్ (VFX) వాడకం పెరిగిపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేవలం కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని చేసే యాక్షన్ కంటే, ప్రాణాలకు తెగించి చేసే ఒరిజినల్ స్టంట్స్‌లోనే అసలైన మజా ఉంటుందని 58 ఏళ్ల ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్, కన్నప్ప శివుడు స్పష్టం చేశారు.

వీఎఫ్ఎక్స్ వద్దు.. రియల్ యాక్షన్ ముద్దు!

15 మంది సాయంతో గాలిలో ఎగిరి తన్నడం నాకు నచ్చదు, రియల్ ఫైట్ చేయాలి.. కన్నప్ప శివుడు అక్షయ్ కుమార్ కామెంట్స్
15 మంది సాయంతో గాలిలో ఎగిరి తన్నడం నాకు నచ్చదు, రియల్ ఫైట్ చేయాలి.. కన్నప్ప శివుడు అక్షయ్ కుమార్ కామెంట్స్

కరాటే, ముయ్ థాయ్, టైక్వాండో వంటి యుద్ధ విద్యల్లో ఆరితేరిన అక్షయ్ కుమార్, పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం యాక్షన్ సినిమాలు తీసే విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఫైట్స్ అన్నీ సహజంగా ఉండేవి. ఇప్పుడు అంతా వీఎఫ్ఎక్స్ మయం అయిపోయింది. ఇది చూడటానికి కృత్రిమంగా అనిపిస్తోంది. నాకు మాత్రం నిజమైన యాక్షన్ సినిమా చేయాలని ఉంది" అని అక్షయ్ కుమార్ తన మనసులో మాట చెప్పారు.

నిజంగా దూకడమే

నేటి టెక్నాలజీ యుగంలో తన ఆలోచనలు వింతగా అనిపించవచ్చు కానీ, ప్రేక్షకులు ఆ కష్టాన్ని గుర్తించాలని అక్కీ కోరుకుంటున్నారు. "నేను దూకానంటే అది నిజంగా దూకడమే అయి ఉండాలి. నేను తన్నానంటే అది నిజంగా తన్నడమే కావాలి. 15 మంది సాయంతో గాలిలో ఎగిరి తన్నడం నాకు నచ్చదు" అని అక్షయ్ కుమార్ తెలిపారు.

చేత్తో గీసిన పెయింటింగ్‌

"AI కాలంలో కూడా నేను రియల్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను అంటే కొందరు ఏదైనా అనుకోవచ్చు. కానీ, చేత్తో గీసిన పెయింటింగ్‌కు, డిజిటల్ ప్రింట్‌కు ఉండే తేడానే ఇక్కడ కూడా కనిపిస్తుంది. డిజిటల్ ప్రింట్ పర్ఫెక్ట్‌గా ఉండవచ్చు కానీ, చేత్తో గీసిన బొమ్మలో ఉండే ఆ చిన్న చిన్న లోపాలే దానికి సహజత్వాన్ని ఇస్తాయి" అని అక్షయ్ కుమార్ వివరించారు.

ఖిలాడీ నుంచి దేశభక్తి చిత్రాల వరకు..

'సూర్యవంశీ' వంటి పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌తో పలకరించిన అక్షయ్ కుమార్ ఇప్పుడు మళ్లీ పాత రోజులను గుర్తుచేసేలా విన్యాసాలు చేయాలని తహతహలాడుతున్నారు. అక్షయ్ కుమార్ తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించిన విషయం తెలిసిందే.

రాబోయే చిత్రాలు

అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'గోల్‌మాల్ 5'లో అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీలతో కలిసి ఆయన అలరించనున్నారు. అలాగే, ప్రియదర్శన్ దర్శకత్వంలో వస్తున్న 'భూత్ బంగ్లా' ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks