నటుడు ఇమ్రాన్ హష్మి ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్’లో ఒక అతిథి పాత్రలో కనిపించాడు. ఈ వెబ్ సిరీస్‌ను థియేటర్లలో విడుదల చేసి ఉండాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇమ్రాన్.. ఈ సిరీస్‌కు "బాక్సాఫీస్ వద్ద రూ. 600-700 కోట్లు" వసూలు చేసే సత్తా ఉందని అనడం విశేషం.
ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్‌పై ప్రశంసలు

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమైన ఈ వెబ్ సిరీస్‌ను ఇమ్రాన్ హష్మి 'రాజకీయంగా తప్పు' అంటే కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉందని వర్ణించాడు. “మీకు తెలుసా, నేను మొదటి ఎపిసోడ్ కొంతమందితో కలిసి చూశాను.
అది మిమ్మల్ని ఆకర్షించడానికి కొంత సమయం తీసుకుంటుంది. కానీ ఆ తర్వాత కూడా మీరు ఆ సిరీస్ చూస్తూ ఉంటే.. 'వావ్ మీరు ఇంతకు ముందు చూడని దానికి ఇది భిన్నంగా ఉంది' అనిపిస్తుంది. దీన్ని థియేటర్లలో విడుదల చేసి ఉండాల్సింది. ఇది బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా రూ. 600 - 700 కోట్లు వసూలు చేసేది” అని ఇమ్రాన్ అన్నాడు.
షారుక్‌తో సినిమా చేయాలనే కోరిక
ఇదే సందర్భంగా షారుక్ ఖాన్‌తో కలిసి ఒక సినిమాలో నటించాలనే తన కోరికను కూడా ఇమ్రాన్ వెల్లడించాడు. “నేను మిస్టర్ ఎస్సార్కేతో నిర్మాతగా పనిచేశాను. కలిసి ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ అది జరగలేదు. అయితే భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే నేను కచ్చితంగా చేస్తాను” అని ఇమ్రాన్ అన్నాడు.
ఇటీవల పీటీఐతో మాట్లాడిన ఇమ్రాన్.. ‘ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్’లో తన అతిథి పాత్రకు లభించిన ప్రజాదరణకు కారణం.. 2000ల ప్రారంభంలో తన 'లవర్ బాయ్' ఇమేజ్‌పై అభిమానుల్లో ఉన్న నోస్టాల్జియా అని చెప్పాడు.
{{/usCountry}}ఇటీవల పీటీఐతో మాట్లాడిన ఇమ్రాన్.. ‘ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్’లో తన అతిథి పాత్రకు లభించిన ప్రజాదరణకు కారణం.. 2000ల ప్రారంభంలో తన 'లవర్ బాయ్' ఇమేజ్‌పై అభిమానుల్లో ఉన్న నోస్టాల్జియా అని చెప్పాడు.
{{/usCountry}}ఈ వెబ్ సిరీస్ మూడో ఎపిసోడ్‌లో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. లక్ష్మణ్‌కు స్నేహితుడైన రాఘవ్ జుయల్ పాత్ర పోషించిన పర్వైజ్, తన ఆరాధ్యదైవం ఇమ్రాన్ ను కలుస్తాడు. ఈ సందర్భంగా రాఘవ్ పాత్ర ఊహించని విధంగా ఇమ్రాన్ ఐకానిక్ సినిమా ‘మర్డర్’లోని 'కహో నా కహో' పాటను పాడుతాడు.
“ఆ సీన్ చేయడం నాకు సరదాగా అనిపించింది. దానికి అంత గుర్తింపు లభిస్తుందని నాకు తెలియదు. కానీ ఇది గొప్ప విషయం. షోలో భాగమైన అందరి గురించి నేను సంతోషిస్తున్నాను. ఇది ఊహించని విధంగా వైరల్ అయింది. కొంతకాలంగా అభిమానులు నన్ను ఇష్టపడిన 'లవర్ బాయ్' ఇమేజ్‌ను మిస్ అవుతున్నారు. ఇది చాలా సరదాగా ఉంది” అని ఇమ్రాన్ గతంలో పేర్కొన్నాడు.
'ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్‌లో లక్ష్మణ్, సాహెర్ బాంబా, బాబీ డియోల్, ఆన్యా సింగ్, మనీష్ చౌధరి, మోనా సింగ్, విజయ్‌కాంత్ కోహ్లీ, మనోజ్ పహ్వా, గౌతమి కపూర్, రజత్ బేడీ వంటి నటీనటులు నటించారు. ఏడు ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.