...
...
Next Story

సమంత పెళ్లి ఫొటోలు చూసి షాక్ తిన్నాను.. మూడు రోజుల ముందే ఆమెతో షూటింగ్‌ చేశాను: బాలీవుడ్ నటుడి కామెంట్స్

సమంత పెళ్లి ఫొటోలు చూసి తాను షాక్ తిన్నానని అన్నాడు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య. ఆమెతో కలిసి అతడు మా ఇంటి బంగారం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

Published on: Dec 22, 2025, 19:51:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య తెలుసు కదా. ఈ మధ్యే కాంతార: ఎ లెజెండ్ ఛాప్టర్ 1 మూవీతో వచ్చాడు. ఇప్పుడు సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఇటీవల జరిగిన సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి గురించి తనకు అసలు తెలియదని, షూటింగ్ చేసి వచ్చిన మూడు రోజులకే వారి పెళ్లి ఫోటోలు చూసి షాక్ అయ్యానని గుల్షన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"మూడు రోజుల ముందే కలిశాను.."

సమంత పెళ్లి ఫొటోలు చూసి షాక్ తిన్నాను.. మూడు రోజుల ముందే ఆమెతో షూటింగ్‌ చేశాను: బాలీవుడ్ నటుడి కామెంట్స్
సమంత పెళ్లి ఫొటోలు చూసి షాక్ తిన్నాను.. మూడు రోజుల ముందే ఆమెతో షూటింగ్‌ చేశాను: బాలీవుడ్ నటుడి కామెంట్స్

విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన గుల్షన్ దేవయ్య త్వరలో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమాలో అతడు నటిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు సమంత పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గుల్షన్ దేవయ్య, దర్శకుడు రాజ్ నిడిమోరుతో గతంలో 'గన్స్ అండ్ గులాబ్స్' (Guns & Gulaabs) సిరీస్‌లో పనిచేశారు. అయినప్పటికీ సమంత, రాజ్‌ల పెళ్లి విషయం తనకు తెలియదని అతడు చెప్పడం విశేషం.

"నేను 'మా ఇంటి బంగారం' షూటింగ్‌లో సమంతతో కలిసి పాల్గొన్నాను. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్ళాను. సరిగ్గా మూడు రోజుల తర్వాత చూస్తే.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకొచ్చాయి. అది చూసి నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నాకు ఆ పెళ్లి గురించి అస్సలు ఐడియా లేదు" అని గుల్షన్ చెప్పుకొచ్చాడు.

సమంత - రాజ్ లవ్ స్టోరీ

'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల సమయంలో సమంత, రాజ్ నిడిమోరు కలిసి పనిచేశారు. 2023 నుంచి వీరిద్దరి డేటింగ్ గురించి వార్తలు వచ్చినా.. రాజ్ అప్పటికే శ్యామలీ దేతో పెళ్లి బంధంలో ఉండటంతో (విడాకుల గురించి అధికారిక ప్రకటన రాలేదు) చాలామంది ఆ వార్తలను కొట్టిపారేశారు.

గుల్షన్ దేవయ్య ఈ ఏడాది ఫుల్ బిజీగా ఉన్నాడు. రిషబ్ శెట్టి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ ‘కాంతార చాప్టర్ 1’లో ప్రిన్స్ కులశేఖర పాత్రలో నటించి కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. త్వరలో మాధవన్ నటిస్తున్న 'లెగసీ' (Legacy) సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నాడు. హిందీ విషయానికి వస్తే 'ఉలజ్', 'ఝాన్సీ కా రాజ్‌కుమార్' సినిమాలతో పాటు జియో హాట్‌స్టార్ సిరీస్ 'బ్యాడ్ కాప్'లో నటించాడు. ఇక ఇప్పుడు మా ఇంటి బంగారంతో తెలుగులోకి రావడానికి సిద్ధమవుతున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe