బాలీవుడ్ వెండితెరపై దశాబ్దాల పాటు తన నటనతో, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంతో వార్తల్లో నిలిచారు.

ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కమర్షియల్ హబ్‌లలో ఒకటైన లోయర్ పరేల్‌లో మాధురి దీక్షిత్ ఒక కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు. స్క్వేర్ యార్డ్స్ (Square Yards) సమీక్షించిన పత్రాల ప్రకారం, ఈ లీజు ఒప్పందం ఐదేళ్ల పాటు కొనసాగనుంది.
ఆఫీస్ స్పేస్ విశేషాలివే..
లోయర్ పరేల్‌లోని 'వన్ లోధా ప్లేస్' (One Lodha Place) భవనంలో ఈ కమర్షియల్ యూనిట్ ఉంది. సుమారు 731 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఈ ఆఫీసుతో పాటు ఒక కార్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ లావాదేవీని మార్చి 24, 2026న రిజిస్టర్ చేశారు.
దీని కోసం రూ. 72,600 స్టాంపు డ్యూటీ, రూ. 1,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించడంతో పాటు రూ. 17 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ను మాధురి దీక్షిత్ జమ చేశారు. ఈ ఆస్తిని రింకూ పరిక్షిత్ జోషి అనే వ్యక్తి నుంచి మాధురి లీజుకు తీసుకున్నారు.
ఏటేటా పెరగనున్న అద్దె
ఈ ఐదేళ్ల (60 నెలల) లీజు కాలంలో అద్దె ఏటేటా పెరిగేలా ఒప్పందం కుదిరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
మొదటి ఏడాది: నెలకు రూ. 4.25 లక్షలు.
రెండో ఏడాది: 5 శాతం పెరుగుదలతో రూ. 4.46 లక్షలు.
{{/usCountry}}రెండో ఏడాది: 5 శాతం పెరుగుదలతో రూ. 4.46 లక్షలు.
{{/usCountry}}మూడో ఏడాది: రూ. 4.68 లక్షలు.
నాలుగో ఏడాది: రూ. 4.91 లక్షలు.
ఐదో ఏడాది: రూ. 5.16 లక్షలకు అద్దె చేరుకుంటుంది.
మొత్తంగా ఐదేళ్ల కాలానికి మాధురి దీక్షిత్ చెల్లించే అద్దె విలువ రూ. 2.81 కోట్లుగా ఉండనుంది.
లోయర్ పరేల్ ప్రత్యేకత
ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న లోయర్ పరేల్ ఇప్పుడు ముంబైలోని అత్యంత ఖరీదైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా మారింది. కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, సంపన్న కుటుంబాలకు ఇది కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఎత్తైన విలాసవంతమైన భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
శుభ్‌మన్ గిల్ కూడా
ఇటీవలే టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా ముంబైలోని జుహు ప్రాంతంలో రూ. 20 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాధురీ దీక్షిత్ ఈ భారీ డీల్ ద్వారా మరోసారి ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.