...
...
Next Story

Malaika Arora: ఇంటర్నెట్ ఎప్పుడు గట్టిగా కేకలు పెడుతుంది, కానీ ఆ సౌండ్‌కి తెలివి ఉండదు: మలైకా అరోరా మోటివేషనల్ కామెంట్స్

Malaika Arora About Internet Noise And Trolling: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మలైకా అరోరా సోషల్ మీడియా ట్రోలింగ్, ఇంటర్నెట్‌లో అనవసరమైన కామెంట్లపై ఘాటుగా స్పందించారు. ఇంటర్నెట్‌లో విమర్శలు చేసేవారికి, తన ప్రశాంతతకు మధ్య గీసుకున్న లక్ష్మణ రేఖను వివరిస్తూ మోటివేషనల్ కామెంట్స్ చేశారు మలైకా అరోరా.

Published on: May 29, 2026, 13:12:24 IST
Advertisement

Malaika Arora About Internet Noise And Trolling: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫిట్‌నెస్‌కు, గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హాట్ బ్యూటీ మలైకా అరోరా నిరంతరం వార్తల్లో ఉంటారు. అర్బాజ్ ఖాన్‌తో విడాకుల నుంచి మొదలుకొని, యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం, ఇటీవలి బ్రేకప్ వరకు ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది.

బాడీ షేమింగ్, వయసు రీత్యా విమర్శలు

ఇంటర్నెట్ ఎప్పుడు గట్టిగా కేకలు పెడుతుంది, కానీ ఆ సౌండ్‌కి తెలివి ఉండదు: మలైకా అరోరా మోటివేషనల్ కామెంట్స్
ఇంటర్నెట్ ఎప్పుడు గట్టిగా కేకలు పెడుతుంది, కానీ ఆ సౌండ్‌కి తెలివి ఉండదు: మలైకా అరోరా మోటివేషనల్ కామెంట్స్

దీనికి తోడు మలైకా అరోరా వేసుకునే బోల్డ్ దుస్తులపై నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగుతుంటారు. బాలీవుడ్‌లో అత్యధికంగా బాడీ షేమింగ్, వయసు రీత్యా విమర్శలు ఎదుర్కొనే సెలబ్రిటీలలో మలైకా ఒకరు. ఇలాంటి నిరంతర నెగెటివిటీని, ఆన్‌లైన్ వేధింపులను తానెలా తట్టుకుని నిలబడగలుగుతున్నారో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె స్పష్టంగా పంచుకున్నారు.

ఇంటర్నెట్ కేకలు పెడుతుంది.. కానీ దానికి తెలివి లేదు!

హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సోషల్ మీడియా విష సంస్కృతిపై మలైకా అరోరా ఘాటుగా స్పందించారు. "నా మనశ్శాంతిని కాపాడుకోవడానికి నేను ఒక సూత్రాన్ని నమ్ముతాను. ఇంటర్నెట్ ఎప్పుడూ గట్టిగా కేకలు (అరుస్తుందని అర్థం) పెడుతుంది, అంతటా శబ్దం వినిపిస్తుంది. కానీ, ఆ శబ్దానికి ఎప్పుడూ తెలివి ఉండదు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. మన ప్రశాంతతను సమాజంలోని అనామకుల అభిప్రాయాలకు తాకట్టు పెడితే, జీవితంలో ఎప్పటికీ స్థిరపడలేం" అని మలైకా అరోరా పేర్కొన్నారు.

ఈ స్థాయి మానసిక పరిణతి తనకు ఒకేరోజులో రాలేదని, వయసు పెరిగే కొద్దీ జీవితంపై అవగాహన పెరిగిందని ఆమె వివరించారు. ఒకప్పుడు తన గురించి వచ్చే ప్రతి చిన్న కామెంట్‌కు బాధపడేదాన్ని అని, ఇప్పుడు ఆ అలవాటును పూర్తిగా మార్చుకున్నానని చెప్పారు. తన చుట్టూ ఉన్న నిజమైన ప్రపంచాన్ని, తనను ప్రేమించే కుటుంబ సభ్యులను మాత్రమే తాను నమ్ముతానని, ఇంటర్నెట్ కామెంట్లు తన ఇంట్లోకి రానివ్వనని స్పష్టం చేశారు మలైకా అరోరా.

నా బలాన్నే బలహీనతగా చూపాలని చూశారు

"సమాజం మనలో ఏ గుణాలనైతే తొక్కేయాలని చూస్తుందో, అవే మన అసలైన బలాలు. అందుకే ఇప్పుడు నేను ఎవరికీ క్షమాపణలు చెప్పకుండా, నా ఇష్టప్రకారం నేను బతుకుతున్నాను" అని ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చారు మలైకా అరోరా. ఇతరుల కంఫర్ట్ కోసం తనను తాను మార్చుకునే ఉద్దేశం అస్సలు లేదని మోటివేషనల్ కామెంట్స్ చేశారు మలైకా.

వ్యాపార రంగంలో సరికొత్త అడుగులు

కేవలం వెండితెర గ్లామర్‌కే పరిమితం కాకుండా మలైకా అరోరా ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమన్‌గా ఎదుగుతున్నారు. ఇప్పటికే 'స్కార్లెట్ హౌస్' వంటి రెస్టారెంట్లను నడుపుతున్న ఆమె, తాజాగా లైఫ్‌స్టైల్ యాక్సెసరీస్ బ్రాండ్ 'మేజాయ్' (Maejoy) ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం మింత్రా (Myntra) భాగస్వామ్యంతో ఈ బ్రాండ్‌ను లాంచ్ చేశారు.

"ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సెలబ్రేట్ చేయడమే నా బ్రాండ్ ముఖ్య ఉద్దేశం. స్టైల్ అనేది మనల్ని శక్తివంతంగా మార్చాలి కానీ భారంగా అనిపించకూడదు" అని తన సరికొత్త వ్యాపార ప్రస్థానం గురించి మలైకా అరోరా వెల్లడించారు. నెగెటివిటీని పక్కనపెట్టి కెరీర్‌పై దృష్టి పెడితే ఎలాంటి విజయాలు సాధించవచ్చో మలైకా అరోరా తాజా నిర్ణయాలు నిరూపిస్తున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై మలైకా అరోరా ఏమన్నారు?

ఇంటర్నెట్ ఎప్పుడూ పెద్దగా అరుస్తుందే తప్ప దానికి తెలివితేటలు ఉండవని మలైకా అన్నారు. ఆన్‌లైన్ విమర్శలను మనసులోకి తీసుకోకుండా, మనశ్శాంతిని కాపాడుకోవడానికి ఒక సరిహద్దును గీసుకోవాలని ఆమె సూచించారు.

2. విమర్శలను ఎదుర్కోవడంలో మలైకాకు ఎలాంటి మార్పు వచ్చింది?

గతంలో తన గ్లామర్, కెరీర్ విషయంలో సమాజం ఏమనుకుంటుందోనని భయపడేదాన్నని, కానీ వయసుతో పాటు వచ్చిన అనుభవంతో ఇప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నానని తెలిపారు.

3. మలైకా అరోరా తాజాగా ప్రారంభించిన కొత్త వ్యాపారం ఏమిటి?

ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ రంగంలోకి అడుగుపెడుతూ మలైకా అరోరా 'మేజాయ్' (Maejoy) అనే సరికొత్త లైఫ్‌స్టైల్ యాక్సెసరీస్ బ్రాండ్‌ను మైంత్రా భాగస్వామ్యంతో ప్రారంభించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe