Malaika Arora: వాటిని చూసి నేను, నా కొడుకు నవ్వుకుంటాం- డేటింగ్ రూమర్లపై మలైకా అరోరా కామెంట్స్- అందమైన విషయాలే అంటూ!
Malaika Arora Comments On Dating Rumours: తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వరుస డేటింగ్ పుకార్లపై బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా స్పందించారు. తనకు తోడు అవసరమే కానీ, ఒక పురుషుడు ఉంటేనే తన జీవితం సంపూర్ణం అవుతుందని తాను నమ్మనని, ప్రస్తుతం తన ఒంటరితనాన్ని ఆస్వాదిస్తున్నానని స్పష్టం చేశారు.
బాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ మలైకా అరోరా ఏం చేసినా సంచలనమే అవుతోంది. మలైకా అరోరా జిమ్‌కు వెళ్లినా లేదా ఎవరితోనైనా పార్టీలో కనిపించినా చాలు, వెంటనే డేటింగ్ పుకార్లు షికారు చేస్తుంటాయి.

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత మలైకా అరోరా జీవితంలోకి మరో "మిస్టరీ మ్యాన్" వచ్చాడంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె తాజాగా నోరు విప్పారు. 'కర్లీ టేల్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు.
"అవన్నీ చూసి నవ్వుకుంటాం"
ఇటీవల స్ల్పిట్స్‌విల్లా ఫేమ్ సోరబ్ బేడీతో మలైకా అరోరా దిగిన ఒక ఫోటో వైరల్ కావడంతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై మలైకా స్పందిస్తూ.. "నిజం చెప్పాలంటే ఇలాంటి పుకార్లు విన్నప్పుడు చాలా చిరాకు వేస్తుంది. కానీ, ఇప్పుడు వాటిని ఒక జోక్‌లా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను" అని చెప్పింది.
"నా కొడుకు అర్హాన్ ఖాన్, నేను కలిసి కూర్చుని ఈ డేటింగ్ వార్తలను చూసి నవ్వుకుంటాం. నా జీవితంలో ఏదైనా జరగాలని ఉంటే అది జరుగుతుంది. దాన్ని నేను ప్లాన్ చేయలేను. ప్రస్తుతం నేను నా జీవితాన్ని, కెరీర్‌ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాను" అని మలైకా అరోరా తెలిపారు.
ఒంటరి తల్లిగా నా ప్రయాణం గర్వంగా ఉంది
ఒక సింగిల్ మదర్‌గా తన ప్రయాణం గురించి మలైకా అరోరా ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. "జీవితాన్ని మొదటి నుంచి స్వయంగా నిర్మించుకోవడం నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. తోడు ఉండటం, భాగస్వామి దొరకడం అనేవి అందమైన విషయాలే. కానీ నా జీవితం పరిపూర్ణం కావడానికి ఒక పురుషుడు తోడుండాలని నేను అనుకోవడం లేదు" అని మలైకా అరోరా చెప్పుకొచ్చింది.
"నేను ఒక స్వయంకృషితో ఎదిగిన మహిళను (Self-made woman). ఒకవేళ నేను ఎవరితోనైనా ఉండాలని నిర్ణయించుకుంటే, అది కచ్చితంగా నా నిబంధనల ప్రకారమే ఉంటుంది" అని మలైకా అరోరా కుండబద్దలు కొట్టారు. కేవలం స్నేహితులు, సహోద్యోగులు లేదా మేనేజర్‌తో కనిపించినా సరే.. తనను వారితో ముడిపెట్టి వార్తలు రాయడం ఇప్పుడు పరిపాటిగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కెరీర్ విశేషాలు
ఇకపోతే మలైకా అరోరా 2017లో అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అర్జున్ కపూర్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న మలైకా అరోరా 2024లో అతడితో కూడా విడిపోయారు.
రచయిత్రిగా కూడా
వృత్తిపరంగా చూస్తే, 2025లో వచ్చిన ‘థామా’ సినిమాలో రష్మిక మందన్నాతో కలిసి మలైకా చేసిన ‘పాయిజన్ బేబీ’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. అలాగే యో యో హనీ సింగ్ ‘చిల్‌గమ్’ మ్యూజిక్ వీడియోలోనూ మలైకా మెరిశారు. నటిగానే కాకుండా ‘ఇట్స్ ఈజీ టు బి హెల్తీ’ అనే పుస్తకంతో మలైకా అరోరా రచయిత్రిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


