Heroine: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇటీవల తల్లి అయిన తర్వాత మొదటిసారి జనం ముందుకు వచ్చిన సమయంలో ఆమె లుక్స్, బరువు పెరగడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగారు. మాతృత్వాన్ని పొందిన ఒక మహిళను ఇలా దారుణంగా బాడీ షేమింగ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే 2024లో తల్లిగా మారిన మరో టాలెంటెడ్ నటి రిచా చద్దా (Richa Chadha) సోషల్ మీడియా సైకోలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా గట్టి కౌంటర్ ఇచ్చారు.
"పొట్ట వేసుకొని తిరిగే వాళ్లే కత్రినా, ఐశ్వర్యలను విమర్శిస్తారు"

తల్లిగా మారిన హీరోయిన్లను గౌరవించడంలో ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుందని, కానీ సోషల్ మీడియా వెనుక దాక్కునే కొందరు పనికిమాలిన వాళ్లే ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తారని రిచా చద్దా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రిచా చద్దా మాట్లాడుతూ.. "మహిళలు తమ శరీరంపై ఇతరులు చేసే కామెంట్లను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ పిల్లల్ని కని, తమ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసే మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా, రాణీ ముఖర్జీ, సోనాలీ బింద్రే వంటి నటీమణులను ఎంతో గౌరవిస్తుంది. విమర్శలు చేసేది ఇండస్ట్రీ కాదు, బయట సోషల్ మీడియాలో తిరిగే సగటు ముసలి, బట్టతల, పెద్ద పొట్ట వేసుకొని తిరిగే మనుషులే" అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
కత్రినా కైఫ్ లేదా ఐశ్వర్య రాయ్ వంటి ప్రపంచ సుందరీమణులపై కామెంట్లు పెడితే తమ జీవితాలు బాగుపడతాయని అలాంటి లూజర్స్ భావిస్తుంటారని, అసలు మీడియా కూడా వీరికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకూడదని రిచా స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఇచ్చిన ఓ గుర్తింపుతో వీళ్లంతా బరితెగించి కామెంట్స్ చేస్తున్నారని, వాళ్ల జీవితాల్లో వాళ్లు బిచ్చగాళ్లని, వాళ్లను పట్టించుకోకుండా ఉండటమే సరైన సమాధానమని సంచలన కామెంట్స్ చేశారు.
బాడీ షేమింగ్ పై కత్రినా కైఫ్ రియాక్షన్ ఇలా..
ఈ బాడీ షేమింగ్ వివాదంపై ఇటీవల బ్రిటన్‌లో జరిగిన ఒక ఈవెంట్లో కత్రినా కైఫ్ (Katrina Kaif) కూడా స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.
{{/usCountry}}ఈ బాడీ షేమింగ్ వివాదంపై ఇటీవల బ్రిటన్‌లో జరిగిన ఒక ఈవెంట్లో కత్రినా కైఫ్ (Katrina Kaif) కూడా స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.
{{/usCountry}}"మనం ప్రతి ఒక్కరి మాటలను పట్టించుకుంటూ పోతే మన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేం. నన్ను ప్రతీసారి విమర్శించే మాటలను నేను సీరియస్‌గా తీసుకుని ఉంటే, భయంతో అక్కడే ఆగిపోయేదాన్ని. కొన్నిసార్లు ప్రపంచం మిమ్మల్ని మెచ్చుకుంటుంది, మరికొన్నిసార్లు మీకు మీరే అతిపెద్ద ఛీర్‌లీడర్‌గా మారాలి" అని కత్రినా చాలా మెచ్యూర్డ్‌గా చెప్పుకొచ్చారు.
కాగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులకు నవంబర్ 7, 2025న విహాన్ కౌశల్ (Vihaan Kaushal) అనే బాబు జన్మించిన సంగతి తెలిసిందే. డెలివరీ తర్వాత తన బాధ్యతలను నెరవేరుస్తూనే పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చిన కత్రినాకు సపోర్ట్‌గా రిచా చద్దా నిలవడంపై నెటిజన్ల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి.