...
...
Next Story

యంగ్ హీరోయిన్ దవడ నిర్మాణంపై ట్రోలింగ్- 2 రకాలుగా చూస్తానన్న షనాయా కపూర్- రియాలిటీ చెక్, నేనే జవాబుదారీ అంటూ!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ షనాయా కపూర్ తనపై వస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాడీ షేమింగ్, ముఖ కవళికలపై వచ్చే కామెంట్లను తాను పట్టించుకోనని.. కానీ పని విషయంలో వచ్చే విమర్శలను మాత్రం సానుకూలంగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు గ్లామర్ బ్యూటీ షనాయా కపూర్.

Published on: Feb 7, 2026, 13:08:37 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఎదుర్కొనే ప్రధాన సవాలు సోషల్ మీడియా ట్రోలింగ్. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో, నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనాయా కపూర్ కూడా దీనికి మినహాయింపు కాదు. వెండితెరపై అడుగుపెట్టినప్పటి నుంచి షనాయా బాడీ షేమింగ్‌కు గురవుతూనే ఉన్నారు.

వ్యంగ్యంగా కామెంట్స్

యంగ్ హీరోయిన్ దవడ నిర్మాణంపై ట్రోలింగ్- 2 రకాలుగా చూస్తానన్న షనాయా కపూర్- రియాలిటీ చెక్, నేనే జవాబుదారీ అంటూ!
యంగ్ హీరోయిన్ దవడ నిర్మాణంపై ట్రోలింగ్- 2 రకాలుగా చూస్తానన్న షనాయా కపూర్- రియాలిటీ చెక్, నేనే జవాబుదారీ అంటూ!

షనయా కపూర్ బక్కపలచని శరీరాకృతిపై, దవడ నిర్మాణంపై నెటిజన్లు తరచూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తుంటారు. అయితే, ఈ విమర్శలను తాను ఎలా ఎదుర్కొంటున్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు బ్యూటిపుల్ షనాయా కపూర్.

విమర్శల్లోనూ మంచిని వెతుక్కుంటా..

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి కామెంట్‌ను తాను చదువుతానని షనయా తెలిపారు. అయితే వాటిని ఆమె రెండు రకాలుగా చూస్తానని తెలిపారు. "నా నృత్యం లేదా నటన గురించి ఎవరైనా విమర్శిస్తే, అది ఎంత కఠినంగా ఉన్నా సరే నేను దానిని ఒక పాఠంగా భావిస్తాను. నా ప్రేక్షకులకు నేనే జవాబుదారీ. ఆ మాటలు కొంచెం బాధ కలిగించినా, నా తప్పులను సరిదిద్దుకోవడానికి అవి ఒక 'రియాలిటీ చెక్'లా ఉపయోగపడతాయి" అని షనాయా కపూర్ వివరించారు.

అవి అస్సలు పట్టించుకోను

కానీ, పనితో సంబంధం లేని విమర్శల విషయంలో షనయా వైఖరి మరోలా ఉంటుందట. "నా ముఖం ఎలా ఉంది? నేను ఎందుకు ఇంత సన్నగా ఉన్నాను? నా దవడ పెద్దదిగా ఉందా? వంటి వ్యక్తిగత కామెంట్లను నేను పూర్తిగా విస్మరిస్తాను" అని షనాయా కపూర్ తెలిపారు.

అంగీకరించడమే మంచిది

ఇకపోతే షనయా కపూర్ తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం 'ఆంఖోన్ కీ గుస్తాఖియాన్' (Aankhon Ki Gustaakhiyan) ద్వారా నటిగా పరిచయమయ్యారు. రస్కిన్ బాండ్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సేతో కలిసి ఆమె నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, షనాయా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

హారర్ సర్వైవల్ థ్రిల్లర్

ప్రస్తుతం బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో 'తూ యా మై' (Tu Yaa Main) అనే యూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్‌లో నటిస్తోంది షనయా కపూర్. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న విడుదల కానుంది. రొమాంటిక్‌తో పాటు హారర్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తూ యా మై మూవీని చిత్రీకరించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe