మృణాల్ ఠాకూర్‌పై పూల వర్షం కురిపించిన హీరో.. ఇంప్రెస్ అయిన బ్యూటీ.. వీడియో వైరల్
ఇటీవల వార్తల్లో తరుచుగా ఉంటున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఓ వైపు చేస్తున్న సినిమాలు కారణమైతే, మరోవైపు ఆమెపై వస్తున్న రూమర్లు మరో రీజన్. తాజాగా ఓ యంగ్ హీరో మృణాల్ ఠాకూర్‌పై పూల వర్షం కురిపించిన వీడియో వైరల్ గా మారింది.
ఓ వైపు ధనుష్ తో డేటింగ్, పెళ్లి రూమర్లు బలంగా వినిపిస్తున్న సమయంలో మృణాల్ ఠాకూర్ పై మరో హీరో పూల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. బ్యూటీ మృణాల్ ఠాకూర్‌పై బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది పూల వర్షం కురిపించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

మృణాల్ పై పూల వర్షం
మృణాల్ ఠాకూర్‌పై బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది పూల వర్షం కురిపించాడు. మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది కలిసి ‘దో దీవానే షెహర్ మే’ సినిమా చేశారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ జంట తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొంది. అక్కడ బయట ఓ ఫొటోగ్రాఫర్ తో మాట్లాడుతున్న మృణాల్ ఠాకూర్‌పై గొడుగులో నింపుకుని వచ్చిన పూలతో వర్షం కురిపించాడు సిద్ధాంత్. దీనికి ఇంప్రెస్ అయిన మృణాల్ రియాక్షన్ వైరల్ గా మారింది.
స్టేజీ పై మళ్లీ
దో దీవాని షెహర్ మే ప్రమోషనల్ ఈవెంట్ స్టేజీపైనా సిద్ధాంత్ చతుర్వేది మళ్లీ ఆ పని చేశాడు. మృణాల్ ఠాకూర్‌పై పూలు కురిపించాడు. ఇప్పుడీ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లిద్దరి రియాక్షన్లు చూస్తే ఏదో ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
ధనుష్ తో డేటింగ్
తమిళ స్టార్ హీరో ధనుష్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 14న వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ మృణాల్ ఠాకూర్ టీమ్ ఈ పుకార్లను ఖండించింది. ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని చెప్పింది. అయినా ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య డేటింగ్ రూమర్లు హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ఈ హీరోతో
కొంతకాలంగా మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది క్లోజ్ గా ఉంటున్నారు. బయట ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. అయితే వీళ్లిద్దరు కలిసి దో దీవాని షెహర్ మే సినిమా చేశారు కాబట్టి ప్రమోషన్ ఈవెంట్ల కోసం కలిసి వెళ్తున్నారు. కానీ కేవలం మూవీ ప్రమోషన్లే కాకుండా వీళ్లిద్దరు కలిసి బయట కనిపించారనే వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఏదో సమథింగ్ ఉందనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.
మృణాల్ ఠాకూర్ సినిమాలు
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. దో దీవానే షెహర్ మే సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. మరోవైపు అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ చేసిన తెలుగు మూవీ డెకాయిట్ ఏమో ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


