అంకుల్స్ నా నడుము మీద చేయి వేశారు-అసభ్యకరమైన సైగలు-లో యాంగిల్ లో వీడియోలు-వాళ్ల కూతుర్లకు ఇలాగే చేస్తారా: నటి మౌనీ రాయ్
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం కోసం స్టేజీ పైకి వెళ్లిన ఆమె నడుముపై అంకుల్స్ చేయి వేశారని చెప్పింది. వాళ్ల కూతుర్లకు ఇలాగే చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ కు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్ కోసం వెళ్లిన ఆమె వేధింపులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని శనివారం (జనవరి 24) ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లో వెల్లడించింది మౌనీ రాయ్. వాళ్ల కూతుళ్లకు, సిస్టర్స్ కు ఇలాగే జరిగితే ఊరుకుంటారా? అని ప్రశ్నించింది ఈ భామ.

మౌనీ రాయ్ బాధ
తాను ఇటీవల ప్రదర్శన ఇచ్చిన కార్యక్రమంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి నటి మౌనీ రాయ్ బహిరంగంగా వెల్లడించింది. కార్యక్రమంలో పాల్గొన్న, తాతయ్యలుగా పిలుచుకునే వయస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తుల ప్రవర్తన కారణంగా తాను అవమానకరంగా, షాక్ కు గురయ్యానని మౌనీ తెలిపింది. వేధింపులకు గురయ్యాయని ఆమె ఆరోపించింది.
నడుముపై చేయి
‘‘నిన్న కర్నాల్‌లో ఒక కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న అతిథుల ప్రవర్తన, ముఖ్యంగా తాతయ్యలుగా పిలుచుకునే వయస్సులో ఉన్న ఇద్దరు అంకుల్స్ ప్రవర్తన నాకు అసహ్యం కలిగించింది. కార్యక్రమం ప్రారంభమై, నేను వేదికపైకి నడిచినప్పుడు అంకుల్స్, కుటుంబ సభ్యులు (అందరూ పురుషులే) ఫోటోలు తీయడానికి నా నడుముపై చేయి వేశారు’’ అని మౌనీ రాయ్ పేర్కొంది.
అసభ్యకరమైన సైగలు
‘‘నాకు అది నచ్చలేదు. వెంటనే నేను 'సార్, దయచేసి మీ చేయి తీయండి' అని చెప్పా. స్టేజీపై పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇద్దరు అంకుల్స్ సరిగ్గా నా ముందు నిలబడి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, అసభ్యకరమైన చేతి సైగలు చేస్తూ పేరు పెట్టి పిలిచారు. మొదట మర్యాదగా వారితో అలా చేయవద్దని సంజ్ఞ చేశా. దానికి వారు నాపై గులాబీ రేకులు విసరడం ప్రారంభించారు’’ అని మౌనీ తెలిపింది.

కొత్త అమ్మాయిలు ఎలా?
‘‘నా ప్రదర్శన మధ్యలో నేను బయటకు వెళ్దామని వెళ్లిపోయా. కానీ మళ్లీ వచ్చి పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేశా. అప్పుడు కూడా వారు అలాగే చేశారు. ఏ కుటుంబ సభ్యులు లేదా నిర్వాహకులు వారిని ముందు నుండి తొలగించలేదు. నా లాంటి వారు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తే, ఇక కొత్త అమ్మాయిలు పరిస్థితి ఏంటో ఊహించగలను. నేను అవమానానికి గురయ్యా. షాక్ చెందా. ఈ భరించలేని ప్రవర్తనపై అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా’’ అని మౌనీ రాయ్ రాసుకొచ్చింది.
కూతుర్లకు ఇలాగే చేస్తే
‘‘మేము మా కళ ద్వారా నిజాయితీగా జీవనం సాగించడానికి ప్రయత్నిస్తున్న కళాకారులం. వారి కూతుర్లు, సిస్టర్స్ తో వాళ్ల పురుష స్నేహితులు ఇలాగే ప్రవర్తిస్తే వీళ్లు ఏం చేస్తారోనని ఆశ్చర్యపోతున్నాను. సిగ్గుపడండి! స్టేజీ కాస్త ఎత్తులో ఉంది. కింద నుంచి లో యాంగిల్స్ లో వీడియోలు తీశారు. వీడియోలు తీయొద్దంటే తిట్టారు’’ అని మౌనీ రాయ్ పేర్కొంది.

E-Paper












