Heroine: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ, వివాహం కాకుండానే పిల్లలను కనడం.. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కంటే తప్పేంటని నిత్యా మీనన్ ప్రశ్నించడంతో ఈ అంశంపై రచ్చ మొదలైంది. అయితే చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారు. వీళ్లలో బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా కూడా ఒకరు.
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్

బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా పెళ్లి కంటే ముందే ప్రెగ్నెంట్ అయింది. ఈ విషయాన్ని ఆమెనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రెగ్నెంట్ అని తెలియడంతోనే హడావుడిగా పెళ్లి చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. వెడ్డింగ్ అయిన ఆరు నెలలకే నేహా ధూపియా బిడ్డకు జన్మనిచ్చింది.
అంగద్ బేడీతో
నేహా ధూపియా, అంగద్ బేడీ మధ్య పెళ్లికి ముందే రిలేషన్ షిప్ నడిచింది. ఈ జంట డేటింగ్ లో ఉన్నప్పుడే కమిట్ అయిపోయారు. దీంతో నేహా ధూపియా గర్భం దాల్చింది. ఆ తర్వాత వీళ్లు 2018, మే 10న గురుద్వారాలో పెళ్లి చేసుకున్నారు. తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయం ఇంట్లో వాళ్లకు తెలిసిందని, దీంతో హడావుడిగా అంగద్ ను పెళ్లి చేసుకున్నానని నేహా ధూపియా చెప్పుకొచ్చింది. ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన 72 గంటల్లోనే వీళ్ల వెడ్డింగ్ జరిగిపోయిందంటా.
నేహా ధూపియా గురించి
బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా తెలుగులోనూ సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నేహా.. జపనీస్ లోనూ ఓ మూవీ చేసింది. 2003లో తరుణ్ హీరోగా వచ్చిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ మూవీలో నేహా ఓ సాంగ్ చేసింది. ఆ తర్వాత ‘ఖయామత్: సిటీ అండర్ థ్రెట్’ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేసింది.
రాజశేఖర్ హీరోగా నటించిన ‘విలన్’, నందమూరి బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’ సినిమాల్లో నేహా ధూపియా హీరోయిన్ గా నటించింది. హిందీలో చాలా మూవీస్ లో యాక్ట్ చేసింది. ఓటీటీ ఒరిజినల్స్ లోనూ మెరిసింది.
వీళ్లు కూడా
{{/usCountry}}రాజశేఖర్ హీరోగా నటించిన ‘విలన్’, నందమూరి బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’ సినిమాల్లో నేహా ధూపియా హీరోయిన్ గా నటించింది. హిందీలో చాలా మూవీస్ లో యాక్ట్ చేసింది. ఓటీటీ ఒరిజినల్స్ లోనూ మెరిసింది.
వీళ్లు కూడా
{{/usCountry}}నేహా ధూపియానే కాకుండా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు ఇంకా వేరే వాళ్లు కూడా ఉన్నారు. లేెటెస్ట్ గా అలియా భట్ ఇలాగే పెళ్లికి ముందు గర్భం దాల్చిందని అంటారు. ఆ వెంటనే రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుందని టాక్. ఇక నీనా గుప్తా, సారిక, మహిమ చౌదరి, కొంకణ సేన్ శర్మ, దియా మీర్జా కూడా ఇలాగే పెళ్లికి ముందే నెల తప్పారని సమాచారం.