Bollywood: భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee). ఐకానిక్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దశాబ్దాలుగా అలరిస్తున్నప్పటికీ, తనలో ఉన్న అసలైన నటుడిని చిత్ర పరిశ్రమ ఇంకా పూర్తిగా వాడుకోలేదని ఆయన భావిస్తున్నారు. బాలీవుడ్‌లో ఉన్న 'స్టీరియో టైపింగ్' (ఒకే తరహా పాత్రలలో నటులను బంధించడం) సంస్కృతిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'గజబ్ రాత్' (Gajab Raat) సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ ఇంగ్లిష్ మీడియా సంస్థ 'జూమ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన హిందీ చిత్ర పరిశ్రమపై నిప్పులు చెరిగారు.
"గొప్ప నటులను నాశనం చేసిన పాపం బాలీవుడ్‌దే!"
బాలీవుడ్‌లో నటీనటులకు ఎదురవుతున్న వివక్ష, టైప్‌కాస్టింగ్ గురించి మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. "ఈ పరిశ్రమలో స్టీరియో టైపింగ్ అనేది చాలామంది నటుల కెరీర్‌లను నాశనం చేసింది. గొప్ప ప్రతిభ ఉన్న నటులకు సరైన పాత్రలు ఇవ్వకుండా, సెట్స్‌లో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని ఏమీ కాకుండా చేసి వారి ప్రతిభను కాలరాసిన చెత్త ట్రాక్ రికార్డ్ ఈ ఇండస్ట్రీకి ఉంది. ఎంతోమంది అద్భుతమైన నటులు ఎలాంటి గుర్తింపు లేకుండానే పరిశ్రమ నుంచి నిష్క్రమించారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
తన సొంత కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. "నాలోని నటనా సామర్థ్యంలో కేవలం 25 శాతం మాత్రమే ఇప్పటివరకు మేకర్స్ వాడుకున్నారు. ఇంకా 75 శాతం ప్రతిభ నాలోనే ఉండిపోయింది. అయితే ఒక నటుడిగా నాలో ఇంకా కొత్తగా సాధించాలనే ఆకలి, ఆశయం సజీవంగా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను" అని తెలిపారు.
ఓటీటీ రాకతో పరిస్థితులు మారాయి
గతంలో బాలీవుడ్ తీరుపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, డిజిటల్ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు గణనీయంగా మారాయని మనోజ్ బాజ్‌పాయ్ అభిప్రాయపడ్డారు.
{{/usCountry}}గతంలో బాలీవుడ్ తీరుపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, డిజిటల్ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు గణనీయంగా మారాయని మనోజ్ బాజ్‌పాయ్ అభిప్రాయపడ్డారు.
{{/usCountry}}"మన దేశంలో ఓటీటీలు వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. దీనికి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. ఇప్పుడు కుటుంబ సమేతంగా వీక్షకులు కంటెంట్‌ను చూస్తున్నారు. ఏ నటన బాగుంది, ఏది బాగాలేదు అనేది విశ్లేషణాత్మకంగా మాట్లాడగలుగుతున్నారు. దీనివల్ల ప్రతిభకు సరైన ప్రాధాన్యత దక్కుతోంది" అని అన్నారు.
'గజబ్ రాత్'తో మళ్లీ నీరజ్ పాండే కాంబినేషన్
మనోజ్ బాజ్‌పాయ్ తదుపరి చిత్రం ‘గజబ్ రాత్’. 'అయ్యారీ', 'ఔచ్' చిత్రాల తర్వాత దాదాపు దశాబ్దం సమయం తర్వాత ప్రముఖ మేకర్ నీరజ్ పాండేతో మనోజ్ బాజ్‌పాయ్ మళ్లీ చేతులు కలపడం విశేషం. ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి రితేష్ షా దర్శకత్వం వహించారు.
ఒకే ఒక్క రాత్రి నేపథ్యంలో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌లో తన వ్యక్తిగత స్వార్థం, వృత్తిధర్మం నడుమ నలిగిపోయే ఒక పోలీస్ అధికారి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ అలరించనున్నారు. ఆయనతో పాటు సాఖిబ్ సలీమ్, అక్షయ్ ఓబెరాయ్, దివ్యా దత్తా, కికు శార్ద, నుస్రత్ భరుచా, శ్రద్ధా దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.