నటిపై దర్శకుడి అత్యాచారం, రహస్యంగా వీడియో రికార్డ్, బలవంతంగా ట్యాబ్లెట్స్.. 73 ఏళ్ల డైరెక్టర్ అరెస్ట్
Director Shakeel Noorani Arrested: సినిమా అవకాశాల పేరుతో 33 ఏళ్ల నటిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో సీనియర్ దర్శకుడు షకీల్ నూరానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తుమందు ఇచ్చి, అశ్లీల వీడియోలతో బెదిరింపులకు గురిచేశాడనే తీవ్ర ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
Director Shakeel Noorani Arrested: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి కాస్టింగ్ కౌచ్, వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. 'బడే దిల్ వాలా', గోవిందాతో తీసిన 'జోరు కా గులామ్' వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన సీనియర్ దర్శకుడు, నిర్మాత షకీల్ నూరానీ (73) లైంగిక దాడి కేసులో చిక్కుకున్నారు. ఒక నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని మాల్వానీ పోలీసులు షకీల్ నూరానీని అరెస్ట్ చేశారు.

ఫామ్‌హౌస్‌లో దాక్కుంటే పట్టుకున్న పోలీసులు
ఒక ప్రాజెక్టు స్క్రిప్ట్ చర్చించేందుకు తన నివాసానికి పిలిపించుకుని, నటి (33)పై అత్యాచారానికి ఒడిగట్టినట్లు షకీల్ నూరానీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన మాల్వానీ పోలీస్ బృందం ఆయన కోసం గాలింపు చేపట్టింది.
సతారా జిల్లా మేధా ప్రాంతంలోని ఒక ఫామ్‌హౌస్‌లో నూరానీ తలదాచుకున్నట్లు పసిగట్టిన పోలీసులు, ఆగస్టు 8న తెల్లవారుజామున అక్కడకు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుని ముంబైకి తరలించారు.
ఈ వ్యవహారంపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు కఠిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విచారణలు జరపాల్సి ఉన్నందున ఆయనను బోరివలి హాలిడే కోర్టులో హాజరుపరచగా, కోర్టు షకీల్ నూరానీని ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.
2016 నుంచే నరకయాతన!
బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. వీరిద్దరి పరిచయం ఇప్పటిది కాదు. 2016లో లోఖండ్‌వాలాలో జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవంలో నూరానీతో ఆమెకు మొదటిసారి పరిచయమైంది. ఆ సమయంలో సినిమా అవకాశాల కోసం తనను సంప్రదించాలని ఆయన చెప్పినట్లు నటి వెల్లడించింది.
"స్క్రిప్ట్ చదవడం కోసం మాల్వానీలోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు నాకు తాగడానికి ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన కొద్దిసేపటికే నేను స్పృహ తప్పిపోయాను. ఆ సమయంలో నాపై లైంగిక దాడికి ఒడిగట్టడమే కాకుండా రహస్యంగా వీడియో రికార్డ్ చేశారు" అని సదరు నటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
బెదిరిస్తూ పలుమార్లు అరాచకం
ఆ వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని, పోలీసులకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ పలుమార్లు తనపై అరాచకానికి పాల్పడినట్లు ఆమె వాపోయింది.
అంతేకాకుండా, గర్భం రాకుండా ఉండేందుకు బలవంతంగా మాత్రలు మింగించేవాడని సదరు నటి తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటీవల వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం వెతుక్కుంటూ ముంబై వచ్చిన సమయంలో నటి పోలీసులను ఆశ్రయించి తన బాధను వెళ్లగక్కింది.
లాయర్ వాదన ఇది!
అయితే ఈ ఆరోపణలను షకీల్ నూరానీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ గోయార్ తీవ్రంగా ఖండించారు. తన క్లైంట్‌పై కుట్రపూరితంగా నిందలు వేశారని, కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఆయనను దోషిగా చూడకూడదని స్పష్టం చేశారు. విచారణలో అసలు నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
సినిమా రంగంలో మెరిసిపోవాలనే ఆశతో వచ్చే యువతు బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే ఉదంతాలు ఇండస్ట్రీ చీకటి కోణాన్ని మరోసారి బయటపెడుతున్నాయని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


