...
...
Next Story

ఇంట్లో కుప్పకూలిన మరో బాలీవుడ్ స్టార్.. హుటాహుటిన హాస్పిటల్‌కు త‌ర‌లింపు.. ధ‌ర్మేంద్రను ప‌రామ‌ర్శించిన మ‌రుస‌టి రోజే!

ఓ వైపు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చనిపోయారనే తప్పుడు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో బాలీవుడ్ స్టార్ గోవిందా ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Published on: Nov 12, 2025, 07:47:12 IST
Advertisement

బాలీవుడ్ లో మరో స్టార్ హీరో, నటుడు గోవింద అనారోగ్య పరిస్థితి ఆందోళన రేకెత్తిస్తోంది. గోవిందాను బుధవారం (నవంబర్ 12) ముంబైలోని క్రిటికేర్ ఆసియా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. గోవిందా ఇంట్లో స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. గోవింద్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ధర్మేంద్రను కలిశాక

బాలీవుడ్ స్టార్ గోవింద
బాలీవుడ్ స్టార్ గోవింద

బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. హాస్పిటల్లో ఆయన్ని పరామర్శించేందుకు గోవిందా వెళ్లారు. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు ధర్మేంద్రను పరామర్శించిన మరుసటి రోజే గోవిందా ఆసుపత్రిలో చేరడం గమనార్హం. ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్నప్పుడు గోవిందా ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపించింది.

బుల్లెట్ గాయంతో

ఏడాది వ్యవధిలో గోవిందా ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి. గత ఏడాది అక్టోబర్ 1న ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన లైసెన్స్డ్ రివాల్వర్ మిస్‌ఫైర్ అవ్వడంతో మోకాలికి బుల్లెట్ గాయమైంది. ఈ ఘటన తెల్లవారుజామున సుమారు 4:45 గంటలకు జరిగింది. ముంబై పోలీసుల ప్రకారం, గోవిందా కోల్‌కతాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా తన రివాల్వర్‌ను అల్మారాలో పెడుతున్నప్పుడు అది ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత గోవిందాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

షాక్ అయ్యా

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సభ్యుడైన గోవింద వెంట అప్పుడు ఆయన భార్య సునీతా అహుజా, కుమార్తె టీనా అహుజా ఉన్నారు. ఆయన మీడియా ప్రతినిధులకు, అభిమానులకు నమస్కరిస్తూ అభివాదం చేశారు. ‘నేను కోల్‌కతాలో ఒక షో కోసం బయలుదేరబోతున్నాను. అప్పుడు ఉదయం 5 గంటల సమయం. ఆ సమయంలో అది కిందపడి పేలింది. జరిగిన దానికి నేను షాక్ అయ్యా. కిందకి చూస్తే రక్తం ఫౌంటెన్‌లా వస్తోంది. వెంటనే ఒక వీడియో తీసి, డాక్టర్‌తో మాట్లాడి ఆసుపత్రిలో చేరా’ అని తన ఇంటి బయట వేచి ఉన్న విలేకరులతో గోవిందా అప్పుడు చెప్పారు.

గోవిందా కెరీర్

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks