స్టార్ హీరో తండ్రి మృతి.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న నటుడి ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. సెల‌బ్రిటీల నివాళి

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సిద్ధార్థ్ మల్హోత్ర తండ్రి సునీల్ మల్హోత్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలో అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. తండ్రిని తలుచుకుంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్టు కన్నీళ్లు తెప్పిస్తోంది. సునీల్ మృతికి  బాలీవుడ్ సెలబ్రిటీలు నివాళి అర్పిస్తున్నారు. 

Published on: Feb 18, 2026, 05:50:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అతని తండ్రి సునీల్ మల్హోత్ర ఢిల్లీలో అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిద్ధార్థ్ తన తండ్రిని కోల్పోయిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.

తండ్రితో సిద్ధార్థ్ కపూర్
తండ్రితో సిద్ధార్థ్ కపూర్

సిద్ధార్థ్ తండ్రి మృతి

మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఫిబ్రవరి 14న సిద్ధార్థ్ తండ్రి సునీల్ మల్హోత్రా చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ముంబయి నుంచి సిద్ధార్థ్ మల్హోత్ర, అతని భార్య కియారా అద్వానీ ఢిల్లీ వెళ్లారు. అనారోగ్యంతో సునీల్ కన్నుమూశారు. అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. సిద్ధార్థ్ ఈ కష్ట కాలంలో కుటుంబంతో కలిసి ఢిల్లీలోనే ఉన్నాడు.

ఎమోషనల్ పోస్ట్

సిద్ధార్థ్ తన తండ్రిని తలుచుకుంటూ బరువెక్కిన హృద‌యంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నాడు.

‘‘ఆయన (నాన్న) అరుదైన నిజాయితీ, సమగ్రత, సంస్కృతి కలిగిన వ్యక్తి. ఎన్నటికీ తలవంచని విలువలపై జీవించారు. కఠినత్వం లేని క్రమశిక్షణ. అహంకారం లేని బలం ఆయన సొంతం. జీవితం ఆయన్ని పరీక్షించినప్పుడు కూడా బలంగా నిలబడ్డారు’’ అని సిద్ధార్థ్ తన పోస్టులో రాసుకొచ్చాడు.

నేవీ కెప్టెన్ గా

‘‘మెర్చంట్ నేవీ కెప్టెన్‌గా సముద్రాలను శాసించడం నుంచి నిశ్శబ్ద ధైర్యంతో అనారోగ్యాన్ని ఎదుర్కోవడం వరకు ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. స్ట్రోక్ ఆయన్ని వీల్‌చైర్‌కు పరిమితం చేసినప్పుడు కూడా ఆయన ఆత్మ నిటారుగా నిలబడింది. నాన్న మీ సమగ్రత నా వారసత్వం. మీ బలం ప్రతిరోజూ నాకు మార్గనిర్దేశం చేస్తుంది. మీ పాజిటివిటీ ఇప్పటికీ ఈ కుటుంబాన్ని కలిపి ఉంచుతుంది.

మీరు నిద్రలో ప్రశాంతంగా మమ్మల్ని వదిలి వెళ్లారు. కానీ మీరు లేని లోటు తీరనిది. మీ వల్లే నేను ఇలా ఉన్నా. మీ పేరు, విలువలను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తా. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నా నాన్న’’ అని సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు.

సెలబ్రిటీల నివాళి

సిద్ధార్థ్ పోస్టుతో అతని తండ్రి మరణించినట్లు తెలిసింది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కామెంట్లతో నివాళి సమర్పిస్తున్నారు. అర్జున్ కపూర్, సోని రజ్దాన్, అలియా భట్, కరణ్ జోహార్ తదితర ప్రముఖులు కామెంట్లలో తమ సంతాపం తెలిపారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More