...
...
Next Story

వెంటిలేటర్‌పై సీనియర్ నటుడు.. విషమంగా ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి.. బాగానే ఉన్నాడని హేమా మాలిన చెప్పిన కొన్ని రోజులకే..

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హేమా మాలిని భర్త అయిన అతడు.. కొన్ని రోజుల కిందటే చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లివచ్చాడు. అయితే ఇప్పుడు అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Published on: Nov 10, 2025, 17:32:00 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అతనికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం అతడు సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో అతని భార్య, నటి హేమ మాలిని మీడియాతో మాట్లాడుతూ.. అతడు ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పింది.

బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ధర్మేంద్ర

వెంటిలేటర్‌పై సీనియర్ నటుడు.. విషమంగా ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి.. బాగానే ఉన్నాడని హేమా మాలిన చెప్పిన కొన్ని రోజులకే..
వెంటిలేటర్‌పై సీనియర్ నటుడు.. విషమంగా ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి.. బాగానే ఉన్నాడని హేమా మాలిన చెప్పిన కొన్ని రోజులకే..

హిందుస్థాన్ టైమ్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర సోమవారం (నవంబర్ 10) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నా.. అతని ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యులు దీనిపై అధికారిక ప్రకటన ఏమీ విడుదల చేయలేదు. ధర్మేంద్ర ఆరోగ్యంపై త్వరలోనే మరింత సమాచారం తెలియనుంది.

హేమా మాలిని ఏమన్నదంటే?

ఈ నెల ప్రారంభంలో ధర్మేంద్ర చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లిన తర్వాత.. అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అభిమానులకు అతని భార్య, నటి హేమ మాలిని అభయం ఇచ్చింది. విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్న హేమ మాలినిని ఫోటోగ్రాఫర్‌లు "సార్ ఎలా ఉన్నారు" అని అడగగా.. ఆమె కేవలం 'ఓకే' అని సంజ్ఞ చేసి, అందరికీ ధైర్యం చెప్పింది. ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ చేతులు జోడించారు కూడా.

అప్పుడు కూడా ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారని రిపోర్టులు వచ్చాయి. అయితే నటుడికి సన్నిహితంగా ఉన్న వర్గాలు అది కేవలం సాధారణ ఆరోగ్య పరీక్ష మాత్రమే అని తెలిపాయి. “అవును, ధర్మేంద్ర ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉన్నారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నటుడు మంచి ఆరోగ్యంతో ఉన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం తరచుగా ఆసుపత్రికి వెళ్తారు. అందుకే ఈసారి కూడా వెళ్లారు. అక్కడ ఎవరైనా ఆయనను చూసి ఉండవచ్చు. అందుకే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆయన పూర్తిగా బాగున్నారు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు” అని ఆ వర్గాలు అప్పట్లో చెప్పాయి.

ధర్మేంద్ర ఇటీవలి సినిమాలు

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe