Samantha Bombay High Court: ఆ విషయంలో హీరోయిన్ సమంతకు ఊరట- బాంబే హైకోర్టు కీలక ఉత్తర్వులు!
Bombay High Court Protects Samantha Rights: హీరోయిన్ సమంత పర్సనాలిటీ రైట్స్‌ను ఉల్లంఘిస్తూ రూపొందించిన డీప్‌ఫేక్స్, మార్ఫింగ్ వీడియోలను తక్షణమే తొలగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఏఐ ఉపయోగించి అసభ్యకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
Bombay High Court Protects Samantha Rights: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు వ్యక్తిత్వ హక్కులకు (Personality Rights) రక్షణ కల్పిస్తూ బాంబే హైకోర్టు అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. సమంత అనుమతి లేకుండా సమంత పేరు, ఫోటోలు, గొంతు, రూపు రేఖలను ఉపయోగిస్తూ రూపొందించిన డీప్‌ఫేక్ కంటెంట్‌ను, అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియా, వెబ్‌సైట్ల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఇటీవలి కాలంలో సినీ తారలు, సమాజంలోని ప్రముఖుల రూపాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో దుర్వినియోగం చేసే ధోరణి బాగా పెరిగింది. ఈ తరహా విపరీత ధోరణులపై సమంత న్యాయపోరాటానికి దిగారు.
వికృత కంటెంట్‌కు అడ్డుకట్ట
తన అనుమతి లేకుండా వ్యాపార ప్రకటనలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన గుర్తింపును వాడుకోవడాన్ని సవాలు చేస్తూ సమంత కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ వికృత కంటెంట్‌కు అడ్డుకట్ట వేస్తూ స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులను ప్రకటించింది.
AI సాంకేతికతతో వేధింపులు.. కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సమంత
సమంత తరఫున సీనియర్ న్యాయవాది రశ్మిన్ ఖండేకర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సమంత రూపాన్ని మార్ఫింగ్ చేస్తూ డీప్‌ఫేక్ ఫోటోలు, అసభ్యకర వీడియోలు సృష్టిస్తున్నారని ఆయన విచారణ సందర్భంగా తెలిపారు.
అసభ్యకర వీడియోలు సైతం
ఆమె గొంతు మాత్రమే కాకుండా ఏఐ వాయిస్ జెనరేషన్ ద్వారా అసభ్యకరమైన వీడియోలను సైతం రూపొందిస్తున్నారని వెల్లడించారు. సమంతను కించపరిచేలా, వస్తువుగా చిత్రీకరిస్తూ ఇంటరాక్టివ్ ఏఐ చాట్‌బాట్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారని, ఇవన్నీ ఆమె గౌరవానికి తీవ్ర భంగం కలిగిస్తున్నాయని న్యాయమూర్తికి వివరించారు.
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఈ పిటిషన్‌ను సమగ్రంగా విచారించిన జస్టిస్ మాధవ్ జమ్‌దార్ ఏకసభ్య ధర్మాసనం ప్రతివాదుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "సమంత ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛగా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత (Privacy), మానవ గౌరవం ఆమె పర్సనాలిటీ రైట్స్‌లో భాగం" అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రసారం చేయకూడదంటూ
ప్రతివాదుల అక్రమ చర్యల వల్ల సమంతకు చెందిన ఈ విలువైన ప్రాథమిక హక్కులన్నీ తీవ్రంగా దెబ్బతింటున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. సమంత పేరు, ప్రతిరూపం, గొంతును ఉపయోగించి రూపొందించిన ఎలాంటి అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచురించకూడదని, ప్రసారం చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అనుమతి లేకుండా వాడితే కఠిన చర్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తయారు చేసిన డీప్‌ఫేక్ కంటెంట్‌కు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో డిజిటల్ వేదికలపై ముఖాలను మార్చేసి వికృతానందం పొందే అకతాయిలకు, చట్టవ్యతిరేక వెబ్‌సైట్లకు కోర్టు గట్టి హెచ్చరిక పంపినట్లయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


