...
...
Next Story

అప్పుడు బోర్డర్ మూవీ థియేటర్లలో చూడటానికి డబ్బుల్లేవు.. ఇప్పుడు సీక్వెల్‌లో ఓ హీరోగా.. నటుడి పోస్ట్ వైరల్

పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ ‘బోర్డర్ 2’ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. చిన్నప్పుడు డబ్బులు లేక ‘బోర్డర్’ సినిమాను థియేటర్‌లో చూడలేకపోయానని, టీవీలో చూశానని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఇందులో భాగమయ్యానని ఎమోషనల్ అయ్యాడు.

Published on: Jan 28, 2026, 14:32:20 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా.. అందులో నటించిన దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh) తన నటనకు గాను ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ.. మొదటి ‘బోర్డర్’ సినిమానాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. అప్పట్లో తన దగ్గర సినిమా చూసేందుకు డబ్బులు లేవని, ఇప్పుడు అదే సినిమా సీక్వెల్‌లో నటించడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నాడు.

టీవీలోనే చూశా..

అప్పుడు బోర్డర్ మూవీ థియేటర్లలో చూడటానికి డబ్బుల్లేవు.. ఇప్పుడు సీక్వెల్‌లో ఓ హీరోగా.. నటుడి పోస్ట్ వైరల్
అప్పుడు బోర్డర్ మూవీ థియేటర్లలో చూడటానికి డబ్బుల్లేవు.. ఇప్పుడు సీక్వెల్‌లో ఓ హీరోగా.. నటుడి పోస్ట్ వైరల్

బుధవారం (జనవరి 28) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో దిల్జీత్ దోసాంజ్ మాట్లాడుతూ.. "బోర్డర్ సినిమా వచ్చినప్పుడు దేశమంతా దాని గురించే మాట్లాడుకునేవారు. అప్పట్లో మా ఇంట్లో థియేటర్‌కు వెళ్లనిచ్చేవారు కాదు. పైగా మా దగ్గర థియేటర్‌లో సినిమా చూసేంత డబ్బులు కూడా లేవు. అందుకే ఆ సినిమా టీవీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి, టీవీలోనే చూశాను. అలా రెండు మూడు సార్లు చూసుంటాను" అని చెప్పాడు. తన ఏరియాలో ఒక వ్యక్తి థియేటర్‌లో సినిమా చూసి వచ్చి చెప్పిన విషయాలు విని చాలా ఎగ్జైట్ అయ్యానని గుర్తుచేసుకున్నాడు.

నేను అర్హుడిని కాదేమో..

ప్రస్తుతం తనకు దక్కుతున్న గౌరవం గురించి కూడా దిల్జీత్ మాట్లాడాడు. "ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే.. దేవుడు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను. ఈ సినిమాలో భాగం కావడానికి నన్ను నేను అర్హుడిగా భావించడం లేదు. కానీ దేవుడు నాకు ఏం ఇచ్చినా దానికి కృతజ్ఞుడిని" అని దిల్జీత్ వినమ్రంగా చెప్పాడు.

ఇందులో అతడు పరమ వీర చక్ర గ్రహీత, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ పాత్రను పోషించాడు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి కూడా ఈ చిత్రంలో నటించారు.

బోర్డర్ 2 బాక్సాఫీస్ ప్రభంజనం..

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks