1997లో వచ్చిన 'బోర్డర్' సినిమాలో "సందేశే ఆతే హై" పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'బోర్డర్ 2' (Border 2) కోసం ఆ పాటను రీక్రియేట్ చేస్తూ "ఘర్ కబ్ ఆవోగే" (Ghar Kab Aaoge) అనే ఆడియో ట్రాక్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను సోనూ నిగమ్, అర్జిత్ సింగ్, విశాల్ మిశ్రా, దిల్జీత్ దోసాంజ్ కలిసి పాడటం విశేషం.
నేషన్స్ ఆంథెమ్ మళ్లీ వచ్చింది

దేశభక్తి, సైనికుల త్యాగం, ఇంటిపై బెంగ.. ఈ ఎమోషన్స్ అన్నింటినీ కలిపి 1990ల్లో బోర్డర్ మూవీలో ఒక అద్భుతమైన పాటను అందించారు. ఇప్పుడు అదే పాటను కొత్త హంగులతో, నేటి తరం గాయకులతో కలిపి 'బోర్డర్ 2' మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. టీ-సిరీస్ (T-Series) సంస్థ ఈ పాటను విడుదల చేస్తూ.. దీన్ని "నేషన్స్ యాంథమ్" (Nation's Anthem)గా అభివర్ణించింది.
ఒరిజినల్ పాట పాడిన లెజెండరీ సింగర్ సోనూ నిగమ్ తో పాటు.. ఇప్పటి సెన్సేషన్స్ అర్జిత్ సింగ్, విశాల్ మిశ్రా, దిల్జీత్ దోసాంజ్ ఈ పాటను పాడటం విశేషం. పాత, కొత్త తరాల గొంతుకలు కలవడంతో పాట మరో లెవల్‌కు వెళ్లింది. ఈ కొత్త పాటను జావేద్ అక్తర్ (ఒరిజినల్), మనోజ్ ముంతషిర్ రాశారు. ఇక అను మాలిక్ (ఒరిజినల్), మిథున్ మ్యూజిక్ అందించారు.
అను మాలిక్ ఏమన్నాడంటే?
మొదట్లో ఈ పాట రీక్రియేషన్ గురించి అను మాలిక్ స్పందిస్తూ.. "నేను ఇందులో భాగం కాకపోయినా, అది నా ట్యూన్ కాబట్టి కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి" అని అన్నారు. సోనూ నిగమ్, అర్జిత్ సింగ్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు.
ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. "నిర్మాత భూషణ్ కుమార్ నాకు పూర్తి రెస్పెక్ట్, క్రెడిట్ ఇచ్చారు. ఈ కొలాబరేషన్ పట్ల నాకు గర్వంగా ఉంది" అని వివాదాలకు చెక్ పెట్టాడు.
{{/usCountry}}ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. "నిర్మాత భూషణ్ కుమార్ నాకు పూర్తి రెస్పెక్ట్, క్రెడిట్ ఇచ్చారు. ఈ కొలాబరేషన్ పట్ల నాకు గర్వంగా ఉంది" అని వివాదాలకు చెక్ పెట్టాడు.
{{/usCountry}}ఈ ఎమోషనల్ పాటతో సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైంది. 'బోర్డర్ 2' సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23, 2026న థియేటర్లలో విడుదల కానుంది. 1997లో రిలీజైన బోర్డర్ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. 28 ఏళ్లయినా ఇప్పటికీ ఆ మూవీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ సినిమాలో సన్నీ డియోల్‌తోపాటు సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, జాకీ ష్రాఫ్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఇప్పుడు బోర్డర్ 2లో సన్నీ డియోల్ తిరిగి రాగా.. కొత్తగా వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జిత్ దోసాంజ్, మోనా సింగ్, సోనమ్ బజ్వాలాంటి వాళ్లు నటించారు.