బోర్డర్ 2 నుంచి బ్లాక్‌బస్టర్ సాంగ్ ఘర్ కబ్ ఆవోగే రిలీజ్.. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ఎమోషనల్ సాంగ్

బోర్డర్ 2 మూవీ నుంచి ఘర్ కబ్ ఆవోగే సాంగ్ రిలీజైంది. 28 ఏళ్ల కిందట అంటే 1997లో వచ్చిన బోర్డర్ మూవీలోని సందేశే ఆతే హై సాంగ్ రీమేక్‌గా వచ్చింది. ఈ పాట ఆనాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెస్తోంది.

Published on: Jan 2, 2026, 20:02:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

1997లో వచ్చిన 'బోర్డర్' సినిమాలో "సందేశే ఆతే హై" పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'బోర్డర్ 2' (Border 2) కోసం ఆ పాటను రీక్రియేట్ చేస్తూ "ఘర్ కబ్ ఆవోగే" (Ghar Kab Aaoge) అనే ఆడియో ట్రాక్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను సోనూ నిగమ్, అర్జిత్ సింగ్, విశాల్ మిశ్రా, దిల్జీత్ దోసాంజ్ కలిసి పాడటం విశేషం.

బోర్డర్ 2 నుంచి బ్లాక్‌బస్టర్ సాంగ్ ఘర్ అబ్ ఆవోగే రిలీజ్.. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ఎమోషనల్ సాంగ్
బోర్డర్ 2 నుంచి బ్లాక్‌బస్టర్ సాంగ్ ఘర్ అబ్ ఆవోగే రిలీజ్.. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ఎమోషనల్ సాంగ్

నేషన్స్ ఆంథెమ్ మళ్లీ వచ్చింది

దేశభక్తి, సైనికుల త్యాగం, ఇంటిపై బెంగ.. ఈ ఎమోషన్స్ అన్నింటినీ కలిపి 1990ల్లో బోర్డర్ మూవీలో ఒక అద్భుతమైన పాటను అందించారు. ఇప్పుడు అదే పాటను కొత్త హంగులతో, నేటి తరం గాయకులతో కలిపి 'బోర్డర్ 2' మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. టీ-సిరీస్ (T-Series) సంస్థ ఈ పాటను విడుదల చేస్తూ.. దీన్ని "నేషన్స్ యాంథమ్" (Nation's Anthem)గా అభివర్ణించింది.

ఒరిజినల్ పాట పాడిన లెజెండరీ సింగర్ సోనూ నిగమ్ తో పాటు.. ఇప్పటి సెన్సేషన్స్ అర్జిత్ సింగ్, విశాల్ మిశ్రా, దిల్జీత్ దోసాంజ్ ఈ పాటను పాడటం విశేషం. పాత, కొత్త తరాల గొంతుకలు కలవడంతో పాట మరో లెవల్‌కు వెళ్లింది. ఈ కొత్త పాటను జావేద్ అక్తర్ (ఒరిజినల్), మనోజ్ ముంతషిర్ రాశారు. ఇక అను మాలిక్ (ఒరిజినల్), మిథున్ మ్యూజిక్ అందించారు.

అను మాలిక్ ఏమన్నాడంటే?

మొదట్లో ఈ పాట రీక్రియేషన్ గురించి అను మాలిక్ స్పందిస్తూ.. "నేను ఇందులో భాగం కాకపోయినా, అది నా ట్యూన్ కాబట్టి కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి" అని అన్నారు. సోనూ నిగమ్, అర్జిత్ సింగ్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు.

ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. "నిర్మాత భూషణ్ కుమార్ నాకు పూర్తి రెస్పెక్ట్, క్రెడిట్ ఇచ్చారు. ఈ కొలాబరేషన్ పట్ల నాకు గర్వంగా ఉంది" అని వివాదాలకు చెక్ పెట్టాడు.

ఈ ఎమోషనల్ పాటతో సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైంది. 'బోర్డర్ 2' సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23, 2026న థియేటర్లలో విడుదల కానుంది. 1997లో రిలీజైన బోర్డర్ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. 28 ఏళ్లయినా ఇప్పటికీ ఆ మూవీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ సినిమాలో సన్నీ డియోల్‌తోపాటు సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, జాకీ ష్రాఫ్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఇప్పుడు బోర్డర్ 2లో సన్నీ డియోల్ తిరిగి రాగా.. కొత్తగా వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జిత్ దోసాంజ్, మోనా సింగ్, సోనమ్ బజ్వాలాంటి వాళ్లు నటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More