సినిమా: బోర్డర్ 2

దర్శకుడు: అనురాగ్ సింగ్
నటీనటులు: సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి తదితరులు
రేటింగ్: 3.5/5
రిలీజ్ డేట్: జనవరి 23, 2026
ప్రస్తుతం సీజీఐ, గ్రీన్ స్క్రీన్ ల కాలంలో డబ్బుతో కొనలేని ఒకే ఒక్క స్పెషల్ ఎఫెక్ట్ 'నోస్టాల్జియా'. ఇది సినిమా హాళ్లను టైమ్ మెషీన్ లుగా మారుస్తుంది. 90ల నాటి హిట్ పాటలోని మూడు నోట్స్ లు పెద్దవారిని సైతం పదేళ్ల వయసులోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు బోర్డర్ 2 మరోసారి గతంలోకి తీసుకెళ్లింది. అద్భుతమైన సినిమాటిక్ ను అందించేలా అంచనాలు పెంచేసింది.
29 ఏళ్లకు వచ్చిన సీక్వెల్ బోర్డర్ 2. ఇది ఒరిజినల్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ ను తిరిగి తీసుకురావడమే కాదు.. మరెన్నో విశేషాలను అందించింది. మీరు సన్నీ పాజీ, 'సందేసే ఆతే హై' పాట కోసం థియేటర్ కు వెళ్ళినా మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. మూవీ ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూసేయండి.
బార్డర్ 2 కథ
జేపీ దత్తా (హిందీ వార్ సినిమాలకు మార్గదర్శకుడు) సహ-నిర్మాతగా వ్యవహరించిన 'బోర్డర్ 2'కు, 'కేసరి' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఒరిజినల్ సినిమా లాగే, ఈ కథ కూడా 1971 ఇండో-పాక్ యుద్ధంపైనే ఆధారపడి ఉంది. అయితే, ఈసారి కథ నలుగురి యాంగిల్ నుంచి కొత్తగా కనిపిస్తోంది.
భారత సైన్యం మేజర్ హోషియార్ సింగ్ దహియా (వరుణ్ ధావన్), భారత నావికాదళం లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్ (అహాన్ శెట్టి), భారత వైమానిక దళం ఫ్లైట్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ (దిల్జిత్ దోసాంజ్), వారి సీనియర్, లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కాలేర్ (సన్నీ డియోల్). వారి వ్యక్తిగత ప్రయాణాలు, బాధ్యతాయుతమైన కర్తవ్యం సినిమాకు వెన్నెముకగా నిలుస్తాయి. మరి 1971 ఇండో-పాన్ నేపథ్యంలో సినిమాలో ఏం జరిగిందన్నది స్క్రీన్ పై చూడాల్సిందే.
విశ్లేషణ
బోర్డర్ 2 సినిమాలో ఫస్టాఫ్ లో సైనికుల శిక్షణా రోజులు, వ్యక్తిగత జీవితాలు చూపించారు. ఆ తర్వాత రెండో భాగంలో పూర్తి స్థాయి యుద్ధం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రతి నటుడికి తగినంత స్క్రీన్ సమయం దొరికింది, వరుణ్, దిల్జిత్, అహాన్ ల నేపథ్య కథలు, వారి మధ్య సంభాషణలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అన్షుల్ చోబే ఛాయాగ్రహణం, సుందరమైన ప్రకృతి దృశ్యాల నిశ్శబ్ద సౌందర్యాన్ని, అలాగే ట్యాంకులు, భారీ ఆయుధాలతో కూడిన యుద్ధ దృశ్యాల గందరగోళాన్ని అద్భుతంగా చూపించింది.
{{/usCountry}}బోర్డర్ 2 సినిమాలో ఫస్టాఫ్ లో సైనికుల శిక్షణా రోజులు, వ్యక్తిగత జీవితాలు చూపించారు. ఆ తర్వాత రెండో భాగంలో పూర్తి స్థాయి యుద్ధం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రతి నటుడికి తగినంత స్క్రీన్ సమయం దొరికింది, వరుణ్, దిల్జిత్, అహాన్ ల నేపథ్య కథలు, వారి మధ్య సంభాషణలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అన్షుల్ చోబే ఛాయాగ్రహణం, సుందరమైన ప్రకృతి దృశ్యాల నిశ్శబ్ద సౌందర్యాన్ని, అలాగే ట్యాంకులు, భారీ ఆయుధాలతో కూడిన యుద్ధ దృశ్యాల గందరగోళాన్ని అద్భుతంగా చూపించింది.
{{/usCountry}}కథ పరంగా సినిమా అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చినప్పటికీ వీఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ గా ఉండాల్సిందని అనిపిస్తుంది. సెకండాఫ్ ఓపెనింగ్ లో సినిమా కాస్త స్లోగా నడుస్తున్నట్టు ఉన్నా మళ్లీ క్లైమాక్స్ కు వచ్చేసరికి ఆ ఫీల్ పోతుంది. ఓపికకకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.
యాక్టింగ్
బోర్డర్ మూవీ అంటేనే సన్నీ డియోల్. ఆయన సీక్వెల్ లోనూ నిరాశపర్చలేదు. అద్భుతమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఆయనకు ఇప్పటికీ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. కుటుంబ సభ్యుడిగా, యుద్ధంలో అలసిపోయిన సైనికుడిగానూ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. వరుణ్ నటనను మీమ్ చేయడానికి ఎదురుచూస్తున్న వారు నిరాశ చెందుతారు. ఎందుకంటే బోర్డర్ 2లో అతని నటన మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. మెధా రానాతో ఆయన కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. అహాన్ శెట్టి, దిల్జిత్ కూడా అదరగొట్టారు. హోషియార్ భార్యగా మోనా సింగ్ అద్భుతమైన నటనను అందించారు.
ఫైనల్ గా
జాన్ స్టీవార్ట్ ఎడురి అందించిన నేపథ్య సంగీతం, అను మాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా, సచెట్ పరంపరా, గుర్మొహ్ ల సంగీతం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మొత్తంగా బార్డర్ 2 కేవలం మరో సీక్వెల్ గా మిగిలిపోలేదు. మిమ్మల్ని కూర్చోబెట్టి, సెల్యూట్ చేయమని కోరుతుంది. గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇది మన భారత త్రివిధ దళాలకు అద్భుతమైన ట్రిబ్యూట్.